వేధింపులతో ఎయిర్‌హోస్టెస్‌ ఆత్మహత్య

19 Dec, 2019 10:38 IST|Sakshi

చండీగఢ్ : ఇంటి యాజమాని వేధింపులతో విసుగు చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హర్యానాలోని గురాగ్రామ్‌లో జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మిస్తు సర్కార్‌. స్పైస్‌ జెట్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ హోస్టెస్‌గా విధులు నిర్వర్తిస్తూ గురుగ్రామ్‌లోని ఓ ఇంట్లో పెయింగ్‌ గెస్ట్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటి ఓనర్‌ తరచూ వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన యువతి మంగళవారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్‌ను ఉరేసుకొని మరణించింది. బాధితురాలి తండ్రి హవాలు చందర్‌ సర్కార్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురును యాజమాని మానసికంగా వేధిస్తున్నాడని, తన చావుకు యాజమానే కారణామని.. అందుకే ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆయన మాట్లాడుతూ.. ‘నా కూతురు మంగళవారం ఉదయం 2 గంటలకు కాల్‌ చేసింది. తన ఇంటి ఓనర్‌ అమరిందర్‌ సింగ్‌ తరచూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అదే రాత్రి తిరిగి ఇంటికి వచ్చినప్పడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి, అవమానించాడని చెప్పింది. నాతో ఫోన్‌ మాట్లాడుతున్నంతసేపు ఏడుస్తూనే ఉంది. తన మొబైల్‌ను హ్యాక్‌ చేశాడని, ఎక్కడికీ వెళ్లనివ్వడం లేదని  నాతో చెప్పి ఫోన్‌ కట్‌ చేసింది. తర్వాత కొంత సమయానికి సింగ్‌ తనకు నా కూతురు ఏదో ఆఘాయిత్యానికి పాల్పడిందని సమాచారం ఇచ్చాడు. ఏం జరిగిందని అడిగితే సమాధానం చెప్పలేదు. నేను వెంటనే గురుగ్రామ్‌ పోలీసులను సంప్రదించి విచారణ జరిపించాలని కోరాను’ అని పేర్కొన్నాడు. కాగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా యువతి ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతా జీవిగా పడి ఉంది. అయితే యువతి వద్ద ఎలాంటి సుసైడ్‌ నోట్‌ లభించలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇంటి యాజమానిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు