టీజేఎస్‌ కార్యాలయంపై టీఆర్‌ఎస్‌ నాయకుల దాడి..!

8 Nov, 2018 16:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ రగడ మొదలైంది. ఎన్నికల ప్రచారంతో పాటు ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్యాలయాలపై కూడా దాడులు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ కార్యాలయంపై టీఆర్‌ఎస్‌కు చెందిన వ్యక్తులు బుధవారం రాత్రి దాడి చేశారని తెలంగాణ జనసమితి పార్టీ ఆరోపించింది.  

మిర్జాల్‌గూడలోని తెలంగాణ జనసమితి ఆఫీసుపై దుండగులు దాడి చేసి బ్యానర్లు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారని మల్కాజిగిరి టీజేఎస్‌ అభ్యర్థి కపిలవాయి దిలీప్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యాలయంలో సమీపంలో గల సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందనీ, భద్రత కల్పించాలని మల్కాజిగిరి డీసీపీకి విన్నవించారు. టీజేఎస్‌ అధికార ప్రతినిధి యోగేశ్వర్‌ రెడ్డి వెదిరె ఈ దాడిని ఖండించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టికెట్ల వేటలో భంగపాటు

ఖైరతాబాద్‌లో ఉద్రిక్తత

ముహూర్తం చూసుకొని అభ్యర్థుల నామినేషన్లు 

ప్రచారంలో జోరు.. క్యాడర్‌లో జోష్‌! 

హనుమతో కలవరం!

ట్వీట్‌..హీట్‌!

మరో రెండు జాబితాలు!

పొలిటికల్‌ ‘గిఫ్ట్స్‌’..

తుపాకీ 'రాయుళ్లు'!

ఆరింటిపైనే స్పష్టత..

హెలికాప్టర్‌ నుంచి కరపత్ర ప్రచారం

తగ్గని షుగర్‌ ప్రాబ్లం

ఆ స్థానాలపై  ఆచితూచి..

ఆటపాటలకు ఓటేద్దాం..!

జాబితాపై బాబు ముద్ర

దివ్యాంగ ఓటర్లు 10,047

‘కాంగ్రెస్‌ సీటు ఇచ్చినా.. నేనే పోటీ చేయడం లేదు’

అభివృద్ధికి పట్టం కట్టండి

ఓటు యెట్లెస్తరు సారు.!