పొల్లాచ్చి కేసు : మద్రాస్‌ హైకోర్టు సంచలన ఆదేశాలు

16 Mar, 2019 19:39 IST|Sakshi

తమిళనాట కలకలం రేపిన పొల్లాచ్చి లైంగిక దాడి, బెదిరింపుల కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. లైంగిక వేధింపుల బాధితురాలి పేరు, తదితర వివరాలను బహిర్గతం చేసిన ప్రభుత్వ అధికారులకు భారీ షాక్‌ ఇచ్చింది. ఈ విషయంలో పోలీసులు బాధ్యతా రహితంగా వ్యవహరించారని , ఇది అత్యంత తీవ్రంగా ఖండించదగిన అంశమని  వ్యాఖ్యానించింది. అందుకే క్రమశిక్షణా చర్యగా జరిమానా విధించడం సముచితమని భావించింది. తిరుచ్చికి  చెందిన ఇలాముగిల్‌ దాఖలు చేసిన పిల్‌ను విచారించిన కోర్టు ఈ ఆదేశాలిచ్చింది.  

బాధితురాలి గోప్యత, గుర్తింపు, గౌరవానికి విఘాతం కలిగించినందుకుగాను రూ.25 లక్షల మధ్యంతర నష్టపరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని న్యాయమూర్తులు కిరుబకరాన్, ఎస్ఎస్ సుందర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కోయంబత్తూరు పోలీసు సూపరింటెండెంట్ ఆర్ పండియారాజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే లైంగిక నేరాల కేసుల విచారణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించేలా దర్యాప్తు బృందానికి ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతోపాటు ఈ కేసుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, ఆడియోలు సోషల్‌ మీడియాలో రాకుండా చూడాలని కోరింది. 

>
మరిన్ని వార్తలు