డేరా బాబాను కాపాడేందుకు దిగ్గజ లాయర్లు

5 Apr, 2018 11:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌథ చీఫ్‌ గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ తన ఆశ్రమంలో పలువురిని సామూహికంగా నపుంసకులుగా మార్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో తనకు మద్దతుగా వాదనలు వినిపించేందుకు ప్రముఖ న్యాయవాదులను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఆరుషి హత్య కేసులో తల్వార్లకు విముక్తి కల్పించిన లక్నోకు చెందిన న్యాయవాదులు తన్వీర్‌ అహ్మద్‌ మిర్‌, ధ్రువ్‌ గుప్తాలు ఈ కేసులో డేరా బాబా తరపున వాదనలు వినిపించనున్నారు.

డేరా ప్రధాన కార్యాలయంలో గుర్మీత్‌ సింగ్‌, ఇద్దరు వైద్యుల సాయంతో దాదాపు 400 మంది డేరా అనుచరులను బలవంతంగా వృషణాలు తొలగించడం ద్వారా నపుంసకులుగా మార్చారని సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 1న డేరా బాబాపై చార్జిషీట్‌ నమోదు చేసింది. వైద్యులు పంకజ్‌ గార్గ్‌, ఎంపీ సింగ్‌ల సహకారంతో గుర్మీత్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడని సీబీఐ ఆరోపిస్తోంది. పంచ్‌కుల ప్రత్యేక న్యాయస్ధానంలో డేరా బాబాపై సీబీఐ ఈ మేరకు అభియోగపత్రాన్ని నమోదు చేసింది. పంజాబ్‌ హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు గుర్మీత్‌ సింగ్‌పై సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు