మహిళలకు అసభ్య వీడియో, ఎస్‌ఐ సస్పెన్షన్‌

31 Oct, 2019 08:42 IST|Sakshi

సాక్షి, వేలూరు: వేలూరులో మహిళలకు రాత్రి వేళల్లో అసభ్య వీడియో పంపిన ట్రాఫిక్‌ ఎస్‌ఐపై వేటు పడింది. ఎస్‌ఐని సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ ప్రవేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. వేలూరులో ట్రాపిక్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాజమాణిక్యం ట్రాఫిక్‌ విధి నిర్వహణలో ఉన్న సమయంలో పలువురి వాహనాలను నిలిపి తగిన సర్టిఫికెట్లు ఉన్నాయా..? లేదా..? అనే కోణంలో తనిఖీ చేసేవారు. ఈ సమయంలో మహిళల వాహనాలను నిలిపి తగిన పత్రాలు లేకపోవడంతో వారికి అపరాధ రుసుము వేసే పేరుతో.. వారి సెల్‌ఫోన్‌ నెంబర్లు నమోదు చేసుకునేవారు. 

ఈ సెల్‌ఫోన్‌ నెంబర్లు ఉపయోగించి రాత్రి వేళల్లో మహిళలకు అసభ్యంగా వీడియోలు పంపినట్లు తెలుస్తుంది. దీంతో బాధిత మహిళల బంధువులు ఈనెల 25వ తేదీన ఎస్‌ఐ రాజమాణిక్యంను నిలదీసి వాట్సాప్‌ల ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియోలో ఎస్‌ఐ క్షమాపణ కోరడం వంటి ఘటనలు ఉన్నాయి. దీంతో ఎస్‌ఐ రాజమాణిక్యంను రిజర్వ్‌ పోలీస్‌ శాఖకు బదిలీ చేశారు. వీటిపై వేలూరు డీఎస్పీ బాలసుబ్రమణియన్‌ విచారణ చేపట్టగా ఎస్‌ఐ రాజమాణిక్యం మహిళలకు అసభ్య వీడియో పంపిన విషయాలు నిర్ధారణ అయినట్లు స్పష్టం చేశారు. దీంతో బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ట్రాఫిక్‌ ఎస్‌ఐను సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ ప్రవేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.  

మరిన్ని వార్తలు