లైన్‌మన్‌ అవినీతిపై సీఎండీ అధికారుల విచారణ

15 Jun, 2018 12:20 IST|Sakshi
విచారణకు హాజరైన రైతులు 

నందిపేట్‌(ఆర్మూర్‌): నందిపేట మండలం డొంకే శ్వర్‌ సబ్‌ స్టేషన్‌లో లైన్‌మెన్‌గా పని చేసి, అవినీతి ఆరోపణలతో సస్పెండైన బట్టు రవి ఉదంతంపై వరంగల్‌ సీఎండీ అధికారులు గురువారం నంది పేటలో విచారణ చేపట్టారు.

మండలంలోని జీజీ నడ్కుడ గ్రామానికి చెందిన బట్టు రవి డొంకేశ్వర్‌ లైన్‌మెన్‌గా పని చేసేవాడు. అయితే, కొత్త కనెక్షన్‌ ఇవ్వాలన్నా, ట్రాన్స్‌ఫార్మరు బిగించాలన్నా, టీనో ట్‌ ఇవ్వాలన్నా డబ్బులు వసూలు చేస్తున్నారని రై తులు ఆరోపించారు.

ఏ అవసరం కోసం వెళ్లినా డ బ్బులు ఇవ్వనిదే పని చేసే వాడు కాదని, అనేక అ క్రమాలకు పాల్పడుతున్నాడని డొంకేశ్వర్‌ గ్రామానికి చెందిన రైతులు బూంరెడ్డి, గోపాల్‌రెడ్డి, ధర్మేందర్, భోజన్న, గంగాసరం సురేశ్, గంగారెడ్డి, బార్ల చిన్న నాగరెడ్డి, సిర్‌పూరం చిన్నారెడ్డి, భోజారెడ్డి, రాజు, శ్యాంరెడ్డి, వినయ్‌ ట్రాన్స్‌కో ఎస్‌ఈకి ఫిర్యాదు చేశారు.

ఆయన విచారణకు ఆదేశించగా, గత ఫిబ్రవరిలో డివిజనల్‌ ఇంజినీర్‌ బాల్‌రాజ్‌ విచారణ చేపట్టారు. ఆయన విచారణలో లైన్‌మెన్‌ రవి సుమారు రూ.14 లక్షల మేర అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో రవిని మార్చి 17న సస్పెండ్‌ చేసిన అధికారులు.. విచా రణ నివేదికను వరంగల్‌ సీఎండీ కార్యాలయానికి పంపించారు.

నివేదికను పరిశీలించిన సీఎండీ అధికారులు ఆరోపణలు చేసిన 12 మంది రైతులకు నోటీసులు జారీ చేసి, గురువారం నందిపేటలో ఏడీ కార్యాలయానికి పిలిపించి, వివరాలు సేకరించారు. ఈ విచారణకు ఏడుగురు బాధిత రైతులు హాజరయ్యారు. ఇది రహస్య విచారణ అని, పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తానని విచారణ చేపట్టిన సీఎండీ అధికారి మర్రిరెడ్డి తెలిపారు.

విచారణకు హాజరైన రైతులు 

మరిన్ని వార్తలు