దారుణం: యువతిపై అత్యాచారం, హత్య

24 Aug, 2019 09:01 IST|Sakshi

అత్యాచారం అనంతరం రాయితో మోది హత్య

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని అరకులో దారుణం చోటుచేసుకుంది. కిల్లో పుష్ప అనే గిరిజన యువతి దారుణ హత్యకు గురైంది. యువతిపై తొలుత అత్యాచారానికి పాల్పడ్డ కామాం‍ధుడు.. అనంతరం ఆమె తలపై బండరాయితో బలంగా కొట్టి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన అరకు మండలం శరభగూడ సీ.ఏ.హెచ్ పాఠశాల సమీపంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం నిందితుడు మహేశ్‌ పోలీసులకు లొంగిపోయాడు. వివాహితుడైన మహేశ్‌ గత కొంతకాలంగా పుష్పను పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు. అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిన్న రాత్రి మాట్లాడేందుకు పిలిచి అత్యాచారం చేసి పుష్పను మహేశ్‌ హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

అయితే నిందితుడిని పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు పంపించాలని యువతి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా యువతి దారుణ హత్యతో ఆ ప్రాంతంలో ఒక్కసారి విషాదఛాయలు అలుముకున్నాయి. మండలంలోని చినలబుడు గ్రామానికి చెందిన పుష్ప స్థానిక మీసేవలో పనిచేస్తోంది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా