గిరిజన మహిళ దారుణహత్య

14 Dec, 2018 07:13 IST|Sakshi
హత్యకు గురైన సత్యవతి

భర్తే హతమార్చాడంటూ కుటుంబసభ్యుల ఆరోపణ

పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: బుట్టాయగూడెం బస్టాండ్‌ వె నుక వీధిలో గిరిజన మహిళ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. మృతురాలి ఎడమచేతి వైపు చాకుతో పొడవడంతో తీవ్ర రక్తశ్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. భర్తే హత్య చేశారంటూ మృతురాలి కు టుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, మృతురాలి సోదరి సుశీల తెలిపిన వివరాల ప్రకా రం.. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరానికి చెందిన తడికమళ్ల లెనిన్, అంతర్వేదిగూడెంకు చెందిన కొవ్వాసి సత్యవతి 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

లెనిన్‌ ఓ టీవీ చానల్‌లో విలేకరిగా పనిచేస్తుండగా సత్యవతి పులిరామన్నగూడెం ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్ట్‌ స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం సత్యవతి సెలవు పెట్టి పుట్టింటికి వచ్చింది. గురువారం తిరిగి ఉద్యోగానికి వెళుతున్న సమయంలో హత్యకు గురైంది. ఎస్సై ఆనందరెడ్డి సంఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. సీఐ రమేష్‌బాబు ఇక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాల వల్ల హత్య జరిగినట్లు భావిస్తున్నామని సీఐ చెప్పారు. తన అక్క సత్యవతిని భర్త లెనిన్‌ హత్య చేశాడంటూ మృతురాలి చెల్లెలు సుశీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటి నుంచి డ్యూటీకి పులిరామన్నగూడెం వెళ్తుండగా బుట్టాయగూడెం బస్టాండ్‌ సమీపంలో ద్విచక్రవాహనం ఎక్కమని లెనిన్‌ అడిగాడని అందుకు ఆమె నిరాకరించడంతో బస్టాండ్‌ వెనుక వీధిలో త్రిశక్తి పీఠంవైపు రావాలని పిలిచాడని ఆ సమయంలో కత్తితో పొడిచి పారిపోయాడని సుశీల ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఎస్సై ఆనందరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు