అత్యుత్సాహం అరెస్ట్‌కు దారితీసింది

14 Apr, 2019 16:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ పోలింగ్‌ ఏజెంట్‌ ప్రదర్శించిన అత్యుత్సాహం అతని అరెస్ట్‌కు దారి తీసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లో ఫొటో దిగడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. టీఆర్‌ఎస్‌ మల్కాజ్‌గిరి లోక్‌సభ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డికి ఆ పార్టీకి చెందిన నాయకుడు వెంకటేశ్‌ పోలింగ్‌ ఏజెంట్‌గా ఉన్నారు. అయితే గురువారం పోలింగ్‌ ముగిశాక అధికారులు మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్‌లను భోగారంలోని హోలీమేరి కళాశాలలో భద్రపరిచారు. అయితే పోలింగ్‌ ఏజెంట్‌గా అధికారులతో కలిసి అక్కడికి వెళ్లిన వెంకటేశ్‌ స్ట్రాంగ్‌ రూమ్‌లోని ఈవీఎంలు, వీవీప్యాట్‌ల వద్ద నిలుచుని ఫొటో దిగారు. ఇది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కీసర పోలీసులకు ఫిర్యాదు రావడంతో అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేశారు. కాగా, వెంకటేశ్‌పై క్రిమినల్‌ కేసు నమోదైనట్టు కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు