రైలు కింద పడి టీఆర్‌ఎస్‌ నాయకుడి మృతి

9 Mar, 2018 11:18 IST|Sakshi
మృతుడు టీఆర్‌ఎస్‌ నాయకుడు బొంగు శంకరయ్య(పైల్‌ ఫోటో)

భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : రైలుకింద పడి మండల కేంద్రానికి చెందిన సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడు బొంగు శంకరయ్య(68) గురువారం హైదరాబాద్‌లో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బంధువుల ఇంటికి వెళ్తూ మలక్‌పేట వద్ద మెట్రోరైల్‌ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారికింద పడి అక్కడక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

అనంతరం రాత్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కాగా ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. బొంగు శంకరయ్య 10 ఏళ్లు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, అన్న తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడిగా, టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మరో 10 ఏళ్లు పనిచేశారు. అలాగే సింగిల్‌విండో చైర్మన్‌గా రైతులకు సేవలందించారు.

పలువురి సంతాపం...
ఈయన మృతి పట్ల ఎంపీపీ సార సరస్వతీబాలయ్య, వైఎస్‌ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ చంద్రం, నాయకులు కె. భూపాల్‌రెడ్డి, కోట మల్లారెడ్డి, రామాంజనేయులు, పొనమోని శ్రీశైలం, బొంగు అయిలయ్య, మైసగోని వెంకటేశం, కొంక లక్ష్మినారాయణ, దారెడ్డి మల్లారెడ్డి, సోమలింగం, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు బడుగు దానయ్య, పట్టణ అధ్యక్షుడు గుండ్ల రాంచంద్రం, రామేశ్వర్‌ తదితరులు మృతదేహాన్ని సందర్శించి మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

మరిన్ని వార్తలు