శోకసంద్రమైన కౌడిపల్లి

28 Aug, 2018 10:26 IST|Sakshi
కిషన్‌రెడ్డి అంతిమయాత్రలో పార్థి్థవ దేహం వద్ద ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

అశ్రునయనాల మధ్య టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చిలుముల కిషన్‌రెడ్డి అంత్యక్రియలు

అంబులెన్స్‌లోనే భార్య సుహాసిని

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి.

కౌడిపల్లి(నర్సాపూర్‌) :  టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చిలుముల కిషన్‌రెడ్డి అంత్యక్రియలతో సోమవారం ఆ యన స్వగ్రామం కౌడిపల్లి శోకసంద్రంగా మారిం ది. అశ్రునయనాల మధ్య ఆయన అంతిమయాత్ర సాగింది. కిషన్‌రెడ్డి శుక్రవారం రాత్రి  మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భార్య సుహాసినిరెడ్డి అస్వస్థతగా ఉండటం,  కోడలు, అల్లుడు అమెరికాలు ఉన్నందున సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రకు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, అభిమానులు ప్రజలు అంత్యక్రియలకు భారీగా తరలివచ్చారు.  మృతి చెందిన  మూడు రోజులకు అంత్యక్రియలు జరగగా ఎప్పుడెప్పుడు చూస్తామా అని గ్రామస్తులు ఎదురు చూశారు. నర్సాపూర్‌ నుంచి కౌడిపల్లి వరకు అంతిమ యాత్ర నిర్వహించారు.  

కౌడిపల్లిలోని రెడ్డి శ్మశాన వాటికలో ఆయన మృతదేహాన్ని దహనం చేశారు. అతని కొడుకు శేషసాయిరెడ్డి చితికి నిప్పంటించారు.  ఈ కార్యక్రమానికి కిషన్‌రెడ్డి సోదరుడు ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్‌ పద్మదేవేందర్‌రెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్‌ రాజమణిమురళీధర్‌యాదవ్, ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డి, రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. కిషన్‌రెడ్డి మృతదేహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.

అంతిమయాత్ర సందర్భంగా అతని సోదరుడు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పార్థివదేహం పక్కన కూర్చొని కంటతడి పెట్టడం పలువురిని కలిచివేసింది. కిషన్‌రెడ్డి స్వగ్రామం కౌడిపల్లి కాగా  ఆయన నర్సాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఆస్పత్రి నుంచి శుక్రవారం ఆయన పార్థివ దేహాన్ని నర్సాపూర్‌ తీసుకువచ్చారు.  సోమవారం నర్సాపూర్‌ నుంచి ర్యాలీగా కౌడిపల్లికి అంతిమ యాత్ర సాగింది.  దారి పొడవున పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. 

అస్వస్థతతో అంబులెన్స్‌లో..

కిషన్‌రెడ్డికి లివర్‌ చెడిపోవడంతో అతనికి భార్య సుహాసినిరెడ్డి లివర్‌ డొనేట్‌ చేశారు. కాగా దీంతో అమె అస్వస్థతతో ఉండగా అంత్యక్రియలకు ఆమెను అంబులెన్స్‌లోనే తీసుకువచ్చారు. అంత్యక్రియలు జరుగుతుండగా అంబులెన్స్‌లో నుంచి ఆమె వీక్షించారు. కొడుకు, కోడలు కాళ్లుకడగటం, చితికి నిప్పు అంటించడం కార్యక్రమాలను చేశారు. అంత్యక్రియలలో ఎంపీపీలు పద్మనరసింహారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ సారా యాదమ్మరామాగౌడ్, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ గోవర్ధన్‌రెడ్డి, నాయకులకు దుర్గారెడ్డి, శివాంజనేయులు, చం ద్రందుర్గాగౌడ్, పిశ్కె శెట్టయ్యా, పుండరీకం గౌడ్, కృష్ణగౌడ్‌ వివిధ గ్రామాల ఎంపీటీసీలు, మాజీ స ర్పంచ్‌లు, నాయకులు అధికారులు పాల్గొన్నారు.             

మరిన్ని వార్తలు