కళ్లముందే కాలిబూడిదైన భారీ నోట్లకట్టలు!

22 Apr, 2019 15:52 IST|Sakshi

శ్రీనగర్ ‌: జమ్మూకశ్మీర్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. డబ్బును తరలిస్తున్న ట్రక్కుకు మంటలంటుకోవడంతో కోట్లాది రూపాయల కరెన్సీ కళ్లముందే కాలి బూడిదైంది. అనంతనాగ్‌ జిల్లా ఖాజిగంద్‌ ప్రాంతంలోని పంజాత్‌లో ఆదివారం-సోమవారం మధ్య రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. లోకల్‌ టీవీ చానెళ్లలో ప్రసారం చేసిన వీడియోలో.. ట్రక్కులో, రోడ్డు మీద పెద్ద ఎత్తున పడి ఉన్న తగలబడిపోవడం కనిపిస్తోంది. శ్రీనగర్‌ నుంచి ట్రక్కు జమ్ముకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ట్రక్కులో రూ. ఐదువందల కరెన్సీనోట్ల కట్టలు ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో ఎన్నికల సంఘం, పోలీసులు ఘటనపై దృష్టి సారించారు. ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందా? అదే అయితే, ఏ పార్టీ, ఏ అభ్యర్థి తరఫున ఈ డబ్బు రహస్యంగా తరలించారని అన్నది తెలియాల్సి ఉంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రేపే ‘హిట్లర్‌’బాబు పతనమయ్యేది!

రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ అలర్ట్‌

ఈవీఎం రగడ : విపక్షాలపై అమిత్‌ షా ఫైర్‌

లోకేశా.. ఏంటా మా(మం)టలు..!

ఈ ఎన్నికల ఫలితాలు మాకు టెన్షన్ ఫ్రీ...

‘మరో 24 గంటలు అప్రమత్తం’

విపక్షాలకు ఎదురుదెబ్బ

ఓట్లను ఎలా ట్యాంపరింగ్‌ చేయవచ్చు!

సుప్రీంపై కాంగ్రెస్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

‘వైఎస్సార్‌సీపీకి 130 సీట్లు పక్కా’

భారీగా పెరిగిన సర్వీస్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

ఏర్పాట్లు ముమ్మరం 

తెలుగు తమ్ముళ్లు నోరెళ్లబెట్టాల్సిందే..!

ఎవరి లెక్కలు వారివి..!

‘బీజేపీ గెలిస్తే.. ఊరు విడిచి వెళ్తాం’

కౌంటడౌన్‌కు వేళాయేరా ..!

మరో.. 24 గంటలు! 

‘రేపటితో రాజకీయ నిరుద్యోగిగా చంద్రబాబు’

ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఫ్యాన్‌ వైపే

‘నేను ఓడితే ఈవీఎంలు టాంపరైనట్లే’

తొలి ఫలితం.. హైదరాబాద్‌దే!