ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్‌ అఘాయిత్యం

18 Oct, 2019 15:08 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో సంస్థ ఉన్నతాధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్‌లతో పలు సర్వీసులను నడుపుతున్నారు. అయితే తాత్కాలిక డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి.. తాత్కాలిక మహిళ కండక్టర్‌పై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. చెన్నూరు నుంచి మంచిర్యాల వస్తున్న బస్సులో తాత్కాలిక డ్రైవర్‌ శ్రీనివాస్‌ విధులు నిర్వహిస్తున్నారు. బస్సులో మహిళా కండక్టర్‌ ఉండటంతో.. శ్రీనివాస్‌కు దుర్భుద్ది పుట్టింది. పథకం ప్రకారం బస్సులో ప్రయాణికులు ఎక్కకుండా చూసిన శ్రీనివాస్‌.. మార్గమధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో బస్సును ఆపి మహిళా కండక్టర్‌పై లైంగిక దాడికి యత్నించాడు. అయితే శ్రీనివాస్‌ బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు జైపూర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు జైపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

తాత్కాలిక డ్రైవర్‌కు రూ. 2వేల జరిమానా
సాక్షి, కామారెడ్డి : ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్‌కు జిల్లా జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజ్‌కుమార్‌ రూ. 2వేల జరిమానాల విధించారు. వివరాల్లోకి సిద్ధిపేట డిపోలో తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్న జీ నరేశ్‌ సిద్దిపేట నుంచి కామారెడ్డి బస్సు నడుపుతున్నాడు. అయితే నరేశ్‌ మద్యం సేవించి బస్సు నడపడం గుర్తించిన అధికారులు అతన్ని కామారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో న్యాయమూర్తి అతనికి జరిమానాతోపాటు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

మరిన్ని వార్తలు