ట్యూషన్ పేరుతో బాలికపై కన్నేసి..

6 Mar, 2020 15:23 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

లక్నో : మహిళలు, బాలికలపై లైంగిక దాడుల నిరోధానికి కఠిన చట్టాలు తీసుకువచ్చినా కామాంధుల ఆగడాలకు బ్రేక్‌ పడటం లేదు. ఇక ట్యూషన్‌ కోసం ఇంటికి వచ్చిన మైనర్‌ బాలికపై సదరు ట్యూటర్‌ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసింది. ట్యూటర్‌ భార్య ద్వారా ఈ విషయం తెలియడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పట్టణంలోని సివిల్‌లైన్స్‌ ప్రాంతంలో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. కాగా ట్యూషన్‌ పేరిట ఆమెను ప్రేమలోకి దింపిన నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని, మరో మహిళతోనూ అతడికి సంబంధం ఉందని, ఆమెతో ఓ బిడ్డకు జన్మనిచ్చాడని ఆయన భార్య వెల్లడించారు. బాధిత బాలికను వైద్య పరీక్షలకు తరలించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

చదవండి : మామ లైంగిక వేధింపులు.. కోడలి ఆత్మహత్య

మరిన్ని వార్తలు