మహిళను కత్తితో బెదిరించి...

3 Nov, 2018 10:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో చైన్‌స్నాచర్స్‌ రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను బెదిరించి బంగారు ఆభరణాలను అపహరిస్తున్నారు. ఢిల్లీలోని దయాల్‌పుర్‌ ప్రాంతంలో ఓ బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు దుండగులు.. రోడ్డుపై వెళ్తున్న ఓ మ‌హిళ నుంచి బంగారు గొలుసును కాజేశారు.

త‌న కొడుకుతో క‌లిసి రోడ్డుపై వెళ్తున్న ఆమెను బైక్ మీద వ‌చ్చిన చైన్ స్నాచ‌ర్స్ ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కునే ప్రయత్నం చేశారు. మెడలో నుంచి గొలుసు రాకపోవడంతో బైక్‌ నుంచి కిందికి దిగి క‌త్తితో బెదిరించి లాక్కెళ్లారు. ఈ ఘ‌ట‌న మొత్తం సీసీటీవీలో రికార్డయింది. ఆ ఇద్ద‌ర్నీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్ద నుంచి బంగారు న‌గ‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు