వోల్వో వేగం.. తీసింది ప్రాణం

13 Sep, 2019 12:06 IST|Sakshi
వోల్వో ఢీకొని దెబ్బతిన్న బొలెరో మ్యాక్సీ వెనుక భాగం

బొలెరో మ్యాక్సీని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ వోల్వో బస్సు

ముళబాగిల్‌ వాసులు మృతి

మరో 12 మందికి గాయాలు

రొట్టెల పండుగకు వెళ్లివస్తూ..

నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు వెళ్లి తిరిగి వస్తున్న వారిని మృత్యువు బస్సు రూపంలో కబళించింది. ముందు వెళ్లే వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న బొలెరో మ్యాక్సీని కర్ణాటక వోల్వో బస్సు ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో 12మంది గాయాలపాలయ్యారు.

చిత్తూరు, చంద్రగిరి:  నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు ఆనందోత్సాహాలతో వెళ్లి తిరిగి వస్తున్న వారిని మృత్యువు బస్సు రూపంలో కబళించింది. ముందు వెళ్లే వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న బొలెరో మ్యాక్సీని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 12 మంది గాయాలపాలయ్యారు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీ య రహదారి కొత్త ఇండ్లు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం... కర్ణాటక రాష్ట్రం ముళబాగిల్‌ తాలూకా నగ్వార గ్రామానికి చెందిని సయ్యద్‌ ముజాయిద్‌ బాషా(28) సమీప గ్రామస్తులతో కలసి నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు బొలెరో మ్యాక్సీ లో బుధవారం వెళ్లారు. పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అదే రోజు అర్ధరాత్రి తర్వాత వారంతా తిరుగు ప్రయాణమై మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. కొత్త ఇండ్లు వద్ద వెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో కర్ణాటక ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సు ఎదురుగా వస్తున్న బొలెరో మ్యాక్సీని ఢీకొంది. ఈ ప్రమాదంలో సయ్యద్‌ ముజా     యిద్‌ బాషా, సల్మాన్‌ బాషా(21) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా∙స్థలానికి చేరుకున్నారు.  క్షతగాత్రులు మొహతాజ్, అమ్రిన్‌ తాజ్, సళ్లు తాజ్, అయేషా బేగం, యాస్మిన్‌ తాజ్‌లతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న మరికొంత మందిని 108లో తిరుపతి రుయాకు తరలించారు. అలాగే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తిరుపతి మెడికల్‌ కళాశాలకు తరలించారు. ప్రమాదానికి కారకుడైన వోల్వో బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బొలెరో డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం
కర్ణాటక ఆర్టీసీ వోల్వో బస్సు ఢీకొనబోతున్న సమయంలో బొలెరో మ్యాక్సీ డ్రైవరు నౌషాద్‌ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదమే తప్పింది. బస్సు ఢీకొనే సమయంలో బొలెరో వాహనాన్ని ఎడమవైపు తిప్పేయడంతో బస్సు వేగంగా వచ్చి, వెనుక భాగాన్ని ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.  డ్రైవరు వాహనాన్ని మళ్లించకుంటే వాహనంలోని అందరూ మృత్యువాత పడేవారని సీఐ రామచంద్రారెడ్డి, పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు