సీనియర్ల ర్యాగింగ్‌.. ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

16 Mar, 2019 17:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: ర్యాగింగ్‌ భూతం ఇద్దరు విద్యార్థులను బలి తీసుకుంది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఇద్దరు విద్యార్థులు కళాశాల ఆవరణలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మధురైలోని బలితెప్పకులంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం చోటుచేసుకుంది. సీనియర్ల ర్యాగింగ్‌ను తట్టుకోలేక భరత్‌, ముత్తుకుమార్‌ అనే డిగ్రీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు