విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

31 Jul, 2018 15:04 IST|Sakshi
యాదమ్మ మృతదేహం 

చందంపేట (దేవరకొండ) : విద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు...చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామానికి చెందిన లకుమళ్ల యాదమ్మ(40), భర్త శ్రీనయ్య కూలీలుగా జీవనం సాగి స్తున్నారు.

ఈ క్రమంలోనే యాదమ్మ ఉద యం ఇంట్లో టీవీ ఆన్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. విద్యుత్‌షాక్‌కు గురైన యాదమ్మ కేకలు విని వచ్చిన ఇరుగుపొరుగు వారు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. మృ తురాలికి ముగ్గురుకుమారులు, కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

గ్రామస్తుల ధర్నా..

తమ గ్రామంలో వారం రోజులుగా ఇంటి గోడల కు ఎర్త్‌తో కరెంట్‌ షాక్‌ వస్తుందని పలుమార్లు వి ద్యుత్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, అధకారుల నిర్లక్ష్యంతోనే యాద మ్మ మృతి చెందిందని ఆరోపిస్తూ గ్రామస్తులు ధ ర్నా నిర్వహించారు.

అనంతరం చందంపేట మం డల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద యా దమ్మ మృతతదేహంతో ధర్నా నిర్వహించేందుకు వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించాలని సూచిం చా రు. ఈ క్రమంలోనే పోలీసులకు, గ్రామస్తులకు వా గ్వాదం చోటు చేసుకుంది. మృతురాలి కుటుం బా నికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

జెడ్పీ చైర్మన్‌ నివాళి

జెడ్పీ చైర్మన్‌ బాలునాయక్‌ యాదమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.విద్యుత్‌ అధికారులతో మాట్లాడి వారి కుటుంబానికి న్యాయం చేస్తానని హామీనిచ్చారు. ఆయన వెంట ఎంపీటీసీ గడ్డం లక్ష్మివెంకటయ్య, కొండల్‌రెడ్డి, ఎల్లయ్య, కృష్ణ, నర్సింహ్మ, కొర్రరాంసింగ్, బాబురాం తదితరులున్నారు. 

కొండమల్లేపల్లిలో విద్యార్థి..

కొండమల్లేపల్లి : మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన నాగమణి, యాదగిరి దంపతుల కుమారుడు కున్‌రెడ్డి హేమంత్‌(13) స్థానిక కృష్ణవేణి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో యాదగిరి స్కూల్‌ నుంచి సాయిని తీసుకొచ్చాడు. బయటికి వెళ్లొస్తానని గేటు వేసుకొమ్మని తండ్రి చెప్పి వెళ్లా డు. అయితే ఆ గేటుకు పక్కనే ఉన్న బోరు విద్యుత్‌ వైరు ఆనుకుని ఉంది. ఈ క్రమంలోనే ఇంటిగేటు వేస్తుండగా హేమంత్‌ విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.  

మరిన్ని వార్తలు