తల్లీకొడుకును బలిగొన్న బస్సు

20 Aug, 2018 14:17 IST|Sakshi
రుత్విక్, సరిత (ఫైల్‌) 

వరంగల్‌ క్రైం: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీ, కొడుకులను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు బలితీసుకుంది. కళ్లముందే కట్టుకున్న భార్య, కన్న కొడుకు ఇద్దరు రక్తం మడుగులో కొట్టుకుంటుంటే ఆ తండ్రి పడిన వేదన అందరి చేత కంటతడి పెట్టించాయి. సీఐ సంపత్‌కుమార్‌ కథనం ప్రకారం.. ఆత్మకూర్‌ మండలానికి చెంగిన పాపని సరిత (32), శ్రీనివాస్‌ దంపతులు బ్రాహ్మణవాడలో అద్దెకు ఉంటున్నారు.

వారికి కుమారుడు రుత్విక్‌ (7) ఉన్నాడు. శ్రీనివాస్‌ కేబుల్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సరిత, రిత్విక్‌ ఆదివారం ఉదయం ఇంటర్నెట్‌లో పని ఉండి హన్మకొండ చౌరస్తాకు వచ్చారు. పని ముగించుకొని భర్త శ్రీనివాస్‌కు ఫోన్‌ చేయగా తాను కూడా చౌరస్తాకు వచ్చానని, అశోకా జంక్షన్‌ దగ్గర  ఉండాలని ఫోన్‌లో చెప్పాడు. సరిత, రిత్విక్‌ ఇద్దరు చౌరస్తా నుంచి అశోక్‌ జంక్షన్‌ వైపు నడుచుకుంటూ వస్తున్నారు.

వారి వెనక సుమారు 5 నుంచి 10 మీటర్ల దూరంలో వెనక నుంచి శ్రీనివాస్‌ నడుచుకుంటూ వస్తున్నాడు. ఉదయం 10.43 గంటలకు హన్మకొండ పెట్రోల్‌ పంపు నుంచి బస్టాండ్‌ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు జంక్షన్‌లో మూల తిరుగుతూ రోడ్డు దాటుతున్న సరిత, రిత్విక్‌ను బస్సు ఢీకొట్టి వారి మీది నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన చూసిన స్థానికులు బస్సును నిలిపి వేశారు.

రిత్విక్‌ తల పగిలి అత్యంత దారుణంగా అక్కడికక్కడే మృతిచెందగా.. కొనఊపిరితో ఉన్న సరితను ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు సీఐ సంపత్‌రావు తెలిపారు. తన కళ్ల ముందే భార్య సరిత, కొడుకు రిత్విక్‌లు ఇద్దరు రక్తం మడుగులో కొట్టుకుంటుంటే శ్రీనివాస్‌ గుండెలవిసెలా విలపించిన తీరు అందరి చేత కన్నీరు పెట్టించింది.

డ్రైవర్‌ నిర్లక్ష్యం..

హన్మకొండ పెట్రోల్‌పంపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అశోక జంక్షన్‌లో మూల తిరగాల్సిన దగ్గర తిరగకుండా, చౌరస్తా నుంచి బస్టాండ్‌ వైపుకు ఉన్న ఫ్రీ లెప్ట్‌ నుంచి బస్సు మూల మలుపు తిరిగింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మూలమలుపులో నీళ్లు నిలిచిఉన్నాయి. డ్రైవర్‌ అజాగ్రత్తగా, మూలమలుపులో కూడా వేగంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. 

మిన్నంటిన బంధువుల రోదనలు..

ఎంజీఎం: రోడ్డు ప్రమాదంలో తల్లితో సహా కొడు కు సైతం మృతిచెందడంతో వారి బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఆ మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్వగ్రామమైన ఆత్మకూర్‌కు మృతదేహాలను తరలించారు. కాగా, మా ర్చురీ వద్ద కుటుంబసభ్యులను పరకాల ఎమ్మెల్యే  చల్లాధర్మారెడ్డి, ధర్మరాజు పరామర్శించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రైల్వే పోలీసుల అదుపులో టీడీపీ నాయకుడు

ఒంటరి మహిళలకు మాయ మాటలు చెప్పి...

ఒత్తిడి.. ఉక్కిరిబిక్కిరి!

మహిళపై సామూహిక అత్యాచారం

యువతిపై ప్రియుడి తల్లి కత్తిదాడి

కన్న కొడుకును చూడకుండానే..

ఆన్‌లైన్‌ మోసం..!

పెనుకొండలో కిడ్నాప్‌ కలకలం

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

అటవీ ప్రాంతంలో దారుణం.. మహిళ తలపై..

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

ప్రభుత్వాస్పత్రులే అడ్డాగా.. పిల్లల అక్రమ రవాణా! 

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు బౌన్స్‌

వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని దాడులు

రాజధానిలో మళ్లీ ఐసిస్‌ కలకలం

నలుగురు ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య

జూ పార్క్‌లో కూలిన భారీ వృక్షం.. మహిళ మృతి

జ్యోత్స్న మృతి కేసు : అంకుర్‌, పవన్‌ల అరెస్ట్‌

కర్నూలులో ఘోర ప్రమాదం

అపూర్వను గుడ్డిగా నమ్మాను : ఎన్డీ తివారి భార్య

సీఎం రమేష్‌ మేనల్లుడు ఆత్మహత్య

వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కొల్లేరు లంక గ్రామాల్లో అశ్లీల నృత్యాలు 

గుప్పు.. గుప్పుమంటూ..

కాయ్‌ రాజా కాయ్

ప్రాణం తీసిన మద్యం వివాదం

హత్యాయత్నం కేసుపై డీఎస్పీ దర్యాప్తు

పట్టుచీరల కేసు మాఫీకి యత్నం!

ఇళ్లు కట్టుకుందామంటే వద్దన్నారని..

పేద విద్యార్థినులను వ్యభిచారకూపంలోకి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అక్కడా మీటూ కమిటీ

మరోసారి జోడీగా...

కాపాడేవారెవరు రా?

రాణి పూంగుళలి

గ్యాంగ్‌ వార్‌

నేను నీరులాంటివాడిని