ఒడిశాలో ఎన్‌కౌంటర్లు.. ఆరుగురు మావోలు హతం

14 May, 2018 04:54 IST|Sakshi

మృతుల్లో ఇద్దరు కమాండర్లు

మల్కన్‌గిరి: ఒడిశాలోని బలంగీర్‌ జిల్లా కోప్రకోల్‌ సమితి డుడ్కమాల్‌ గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు హతమైనట్టు తెలిసింది. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు అందిన సమాచారంతో బలంగీర్‌ ఎస్పీ శివసుబ్రహ్మణ్యం ఆదేశాలతో సీఆర్పీఎఫ్, డీబీఎఫ్‌ దళాలు కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఓ ఇంటి వద్ద రాకేశ్, సంజీవ్‌ అనే ఇద్దరు మావో కమాండర్లు కనిపించి పోలీసులపై కాల్పులకు దిగారు. ఎదురు కాల్పుల్లో వారిద్దరూ మృతిచెందారు. అనంతరం పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ కొనసాగించారు. అర్థరాత్రి సమయంలో మరోసారి జరిగిన ఎదురు కాల్పుల్లో మరో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. కాగా, మావోయిస్టు సంజీవ్‌పై ఒడిశా ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు