థియేటర్‌లో ఈవ్‌టీజింగ్‌

30 Dec, 2019 08:16 IST|Sakshi

చెన్నై, తిరువొత్తియూరు: సినిమా చూస్తున్న సమయంలో మహిళ వద్ద అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై వలసరవాక్కం బెత్తానియా నగర్‌ 3వ వీధికి చెందిన జయలక్ష్మి (40) శనివారం రాత్రి వడపళణిలో ఉన్న మాల్‌లో సినిమా చూస్తున్నారు. ఆమె వెనుక సీట్లలో కూర్చొని ఉన్న ఇద్దరు యువకులు కాళ్లతో ఆమెకు అసౌకర్యం కలిగించినట్టు తెలిసింది. దీని గురించి జయలక్ష్మి వారిని ప్రశ్నించగా వారు ఆమెతో అసభ్యంగా మాట్లాడి గొడవ చేశారు. దీని గురించి జయలక్ష్మి వడపళణి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణలో వారు సాలిగ్రామంకు చెందిన రమిష్‌ (29), రమేష్‌ (26) అని తెలిసింది. మద్యం మత్తులో ఉన్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు