నమ్మించి వీడియోలు తీసి.. లైంగిక వేధింపులు

28 Jun, 2020 14:32 IST|Sakshi

గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థుల కీచక పర్వం

సాక్షి, గుంటూరు: ఇంజనీరింగ్ విద్యార్థుల కీచక పర్వం గుంటూరు పట్టణంలో శనివారం వెలుగు చూసింది. తోటి విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ వీడియోలు చిత్రీకరించిన ఇద్దరు యువకులు.. వాటిని అడ్డుపెట్టుకుని కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టు వినకుంటే ఆ వీడియోలను వెబ్‌సైట్‌లో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. మూడేళ్లుగా ఆమెపై వేధింపుల పరంపర సాగుతోంది. ఈక్రమంలో బాధితురాలు దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు వరుణ్, కౌశిక్‌లను 24  గంటల్లోనే అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
(చదవండి: చంద్రదండు అధ్యక్షుడిపై వేధింపుల కేసు)

ఇద్దరు యువతుల ప్రమేయం
వీడియోలతో యువతిని వేధించిన కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితులు వరుణ్, కౌశిక్‌తో పాటు మరో ఇద్దరు యువతులకు ఈ కేసులో ప్రమేయమున్నట్టు వెల్లడైండి. వరుణ్‌ స్నేహితురాలి ద్వారా కౌశిక్ చెల్లెలికి బాధితురాలి వీడియోలు అందినట్టు పోలీసులు గుర్తించారు. కౌశిక్‌ ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయించాడు. వీడియోలు చూపిస్తూ కోరిక తీర్చాలని బాధితురాలిని వేధింపులకు గురిచేశాడు. కాగా, వీడియోలు బయటకు రావడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు యువతులపై కూడా పోలీసులు కేసులు పెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు