మరో ఘోరం : కిడ్నాప్‌, గ్యాంగ్‌రేప్‌

29 Nov, 2019 19:44 IST|Sakshi

కోల్‌కతా: మహిళలపై జరుగుతున్న వరుస ఆఘాయిత్యాలతో దేశం వణికిపోతోంది. హైదరాబాద్‌ షాద్‌నగర్‌లో డాక్టర్‌ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుండగా మరిన్ని ఘోరాలు వెలుగు చూశాయి. కోల్‌కతాలో ఇద్దరు బాలికల సామూహిక అత్యాచార ఉదంతం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. దక్షిణ కోల్‌కతాలోని  కాలీఘాట్ ఆలయం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో  కూడా మైనర్ బాలురు నిందితులు కావడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే కాలీఘాట్‌ ఆలయం వద్ద బాధిత బాలికలు భిక్షాటన  ద్వారా  జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం ముగ్గురు మైనర్‌ బాలురు వీరిని అపహరించుకొని తీసుకెళ్లారు. అనంతరం  మాచండి ఆశ్రమానికి సమీపంలో (దాదాపు 75 కిలోమీటర్ల దూరం) ఉన్న ఆది గంగా వద్ద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. దీంతో బాధిత బాలికల తల్లిదండ్రులు కాలిఘాట్‌  పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు  చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు  నమోదు చేసి, బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం కోసం తరలించామని పోలీసు అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశామని, మరొకరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం నేరం జరిగిన ప్రదేశం నుంచి మరిన్ని ఆధారాలు సేకరించడానికి ప్రయత్నిస్తోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అనుమానం పెనుభూతమై.. 

టీడీపీ నేత బార్‌లో మద్యం విక్రయాలు

డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి

లక్ష విలువైన మద్యం బాటిల్స్‌తో పరార్‌

ప్రాణం తీసిన మద్యం మత్తు

సినిమా

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!