‘మంజీరా’లో ఇద్దరమ్మాయిల గల్లంతు

6 Nov, 2017 03:10 IST|Sakshi
శ్రీవిద్య , రోహిత

      అందరూ చూస్తుండగానే ప్రవాహంలో కొట్టుకుపోయారు 

     సాయంత్రం వరకు లభించని ఆచూకీ 

చిలప్‌చెడ్‌: మంజీరా నదిలో ఆదివారం ఇద్దరు అమ్మాయిలు గల్లంతయ్యారు. అందరూ చూస్తుండగానే నది ఉధృత ప్రవాహంలో వారు కొట్టుకుపోయారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చి ఇలా గల్లంతవడం విషాదం మిగిల్చింది. ఈ ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిట్కుల్‌ శివారులో చోటుచేసుకుంది. హైదరాబాద్‌ మల్కాజ్‌గిరికి చెందిన సతీశ్, రంజనల కుమార్తె శ్రీవిద్య (20) ఓపెన్‌ డిగ్రీ చదువుతూ ప్రైవేట్‌ కంపెనీలో సూపర్‌ వైజర్‌గా పని చేస్తోంది. అలాగే.. సత్యనారాయణ, వసంతల కుమార్తె రోహిత (16) ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదువుతోంది.

మల్కాజ్‌గిరికి చెందిన 30 మంది మహిళలతో కలసి వీరు చిట్కుల్‌ శివారులోని చాముండేశ్వరీ అమ్మవారి దర్శనానికి వచ్చారు. పక్కనే ప్రవహిస్తున్న మంజీరా నదిలో అందరూ స్నానాలు చేశారు. కొంత మంది అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లగా.. శ్రీవిద్య, రోహిత మళ్లీ నదిలోకి దిగారు. ఆ సమయంలో నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇద్దరు అమ్మాయిలు అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయా రు. అమ్మాయిలు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం లో గల్లంతైనా సాయంత్రం ఆరు గంటల వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు.

ప్రస్తుతం నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గాలింపు చర్యలకు అవ కాశం లేదని చెబుతున్నారు. కాగా, సింగూరు జలా లు వదలడం.. పర్యాటక క్షేత్రమైన చాముండశ్వరీ ఆలయ పరిధిలోని మంజీరా నది వద్ద ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకపోవడంతో అమ్మాయిల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా