రక్తపు గాయాలతో ఆందోళన

6 Apr, 2018 13:47 IST|Sakshi
ఆందోళన చేస్తున్న వారిని ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు

గార మండలంలో రెండు వర్గాల మధ్య కొట్లాట

కర్రలు, కత్తులతో డొంకలపేట గ్రామస్తులపై దాడి

గార/శ్రీకాకుళం సిటీ:జిల్లా పోలీస్‌ కార్యాలయం ప్రధాన గేటు వద్ద గురువారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీకూర్మం పంచాయతీ డొంకలపేట గ్రామానికి చెందిన 12 మంది తమకు న్యాయం చేయాలని రక్తమోడుతున్న గాయాలతో ఆందోళనకు దిగారు. ప్రత్యర్థి వర్గం దాడిలో గాయాలయ్యాయని తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న  శ్రీకాకుళం డీఎస్పీ వి.బీమారావు ఆద్వర్యంలో సీఐలు ప్రసాదు, తిరుపతి, పోలీసులు డీపీఓ కార్యాలయానికి చే రుకుని వారిని రిమ్స్‌కు తరలించారు. తమపై దాడి వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని వీరు ఆరోపించారు. డొంకలపేటకు చెందిన పట్నాన చిన్నమ్మడు, వంజరాపు ధనలక్ష్మి, పట్నాన గంగులు, పట్నాన అప్పన్న, పట్నాన రాం బాబు, పి.సూర్యనారాయణ, కలగ అ ప్పారావుతో పాటు మరికొందరు బాధితులు ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ గొడవ..
శ్రీకూర్మం పంచాయతీ పరిధిలోని అటవీ భూముల్లో సుమారు 40 ఎకరాల జీడితోటను వనసంరక్షణ సమి తి పేరిట డొంకలపేట గ్రామానికి చెం దిన 113 మందికి అటవీ శాఖ 2004లో అప్పగించింది. ఏటా జీడితోటపై వచ్చే ఫలసాయాన్ని డొంకలపేటతో పాటు బొద్దవానిపేట, వనుమువానిపేట, నగరాలపేట, పట్నానపేట, తండ్యాలపేట గ్రామాలకు చెం దిన రైతులు పంచుకుంటున్నారు. అయితే తోటను కాంట్రాక్టర్‌కు అప్పగించడం, దీనిపై కొందరికి నమ్మకం లేకపోవడం వివాదానికి కారణ మైంది. డొంకలపేట గ్రామస్తులు రికా ర్డులు తమకు అప్పగించారని, ఇకపై తామే సాగు చేసుకుంటామని తీర్మానించారు. దీన్ని మిగిలిన ఐదు గ్రామాల రైతులు ఈ నిర్ణయానికి ఒప్పుకోకపోవడంతో కొన్నేళ్లుగా ఈ వివాదం నలుగుతోంది.

మధ్యాహ్నం..
గురువారం తోటలోని ఫలసాయం తీ సేందుకు డొంకలపేట రైతులు వెళ్లా రు. మిగిలిన ఐదు గ్రామాల వారు తోటలోకి వెళ్లి వారికి అడ్డుకున్నారు. మధ్యాహ్నం 1 సమయంలో çబొద్దవానిపేట, వనుమువానిపేట, నగరా లపేట, పట్నానపేట, తండ్యాలపేట గ్రామాలకు చెందిన రైతులు కర్రలు, కత్తులతో దాడికి పాల్పడ్డారని డొంకలపేట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే హస్తంతోనే తమపై దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయమై స్థానిక సీఐ ప్రసాదు, ఎస్‌ఐ గణేష్, అటవీశాఖ అధికారి శాంతిస్వరూప్‌ల దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేయాలని కోరడం జరిగిందని పేర్కొన్నారు. మితిమీరిన రా జకీయ జోక్యం కారణంగానే గొడవలు జరుగుతున్నాయని తెలిపారు.

రద్దు చేయాలని లేఖ
అయితే ఐదు గ్రామాల రైతుల వాదన మరోలా ఉంది. వన సంరక్షణ సమితి ఏర్పాటయ్యాక మిగిలిన గ్రామాలకు చెందిన 65 మందిని సమితిలో చేర్చుకునేందుకు తీర్మానం చేశారని వారు చెబుతున్నారు. గత ఏడాది నుంచే గొడవలు జరుగుతున్నాయని, దీనిపై సమితిని రద్దు చేయాలని కోరుతూ గార పోలీసులు అటవీ శాఖ అధికారులకు లేఖ రాశారని చెబుతున్నారు.

రికార్డు సభ్యులే..
దీనిపై జిల్లా అటవీ శాఖ అధికారి సీహెచ్‌ శాంతిస్వరూప్‌ మాట్లాడుతూ వన సంరక్షణ సమితిలో రికార్డైన మెం బర్లే హక్కుదారులని, ఫలసాయంపై వారికే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. వీరి మధ్య గతంలోనే సమావేశాలను ఏర్పాట్లు జరిగినా సఫలం కాలేదని తెలిపారు. వీఎస్‌ఎస్‌ను రద్దు చేస్తే నిజమైన హక్కు దారులకు నష్టం జరుగుతుందని అన్నారు.

బాధితులకు వైద్య సేవలు..
రక్తపు గాయాలతో ఆందోళన చేస్తున్న వారిని రిమ్స్‌కు తరలించామని డీఎస్పీ బీమారావు తెలిపారు. గ్రామానికి చెందిన వారితో మాట్లాడాలని ఎస్పీ ఆదేశించారు. ప్రస్తుతం మెరుగైన వైద్యం అందిస్తున్నాం.

మరిన్ని వార్తలు