కాకి మాంసంతో చికెన్‌ వెరైటీలు

31 Jan, 2020 08:38 IST|Sakshi

రామేశ్వరం: చికెన్‌ మాంసంలో కాకి మాంసాన్ని కలిపి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసిన ఘటన తమిళనాడులోని రామేశ్వరంలో చోటు చేసుకుంది. వివరాలు.. రామేశ్వరంలోని ఓ ఆలయంలో భక్తులు తమ పూర్వీకుల జ‍్క్షాపకార్థం కాకులకు అన్నాన్ని ఆహారంగా వేశారు. అయితే ఆ అన్నాన్ని తిన్న కాసేపటికే కాకులు ఎక్కువ సంఖ్యలో మృతి చెందాయి. దీంతో ఆందోళన చెందిన భక్తులు అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

వేటగాళ్లు కాకులకు మద్యం కలిపిన ఆహారాన్ని ఇవ్వడం వల్లే అవి చనిపోయాయని తేల్చారు. చనిపోయిన కాకులను సేకరించి వాటి మాంసాన్ని చికెన్‌ స్టాల్స్‌కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కాకి మాంసం కలిపిన చికెన్‌ను కొందరు దుకాణదారులు రోడ్డు పక్కన తినుబండారాల్లో వినియోగిస్తున్నట్లుగా తెలిపారు. కాకులను చంపడమే కాక, దాని మాంసాన్ని చికెన్‌ స్టాళ్లకు విక్రయించినందుకుగానూ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుమారు 150 చనిపోయిన కాకులను వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు.

చదవండి: ఆ గుడిలో చికెన్, మటన్ బిర్యానీలే ప్రసాదాలు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా : ఇంట్లోకి రానివ్వకపోవడంతో

జర్మనీలో మంత్రి ఆత్మహత్య 

మత్తు లేని జీవితం వ్యర్థమని..

దారుణ హత్య: సీరియల్‌ సన్నివేశాలే స్ఫూర్తి

కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య

సినిమా

వైరల్‌: మంచు లక్ష్మీని టార్గెట్‌ చేసిన ఆర్‌జీవీ!

కరోనా విరాళం

అంతా బాగానే ఉంది

నేను బాగానే ఉన్నాను

నిర్మాత ప్రసాద్‌ కన్నుమూత

అర్జున్‌.. అను వచ్చేశారు