వీడనున్న రాఘవులు హత్య కేసు మిస్టరీ

24 Jan, 2019 13:11 IST|Sakshi
రాఘవులు ఇంటిని పరిశీలిస్తున్న పోలీసులు (ఫైల్‌)

పోలీసుల అదుపులో ఇద్దరు హంతకులు

ఇద్దరూ సీఎస్‌పురం వాసులే

నిందితుల్లో ఒకడు పాత నేరగాడు

ప్రకాశం,  కనిగిరి: బ్యాంక్‌ ఉద్యోగి వీరారాఘవులు హత్య కేసులో నిందిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. హత్యోదంతంలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు తెలిసింది. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు నిందితులను గుర్తించినట్లు సమాచారం. అర్బన్‌ కాలనీలోని రాఘవులు ఇంట్లో అద్దెకు ఉండే యువకులతో ఆయన మద్యం తాగాడు. ఆ తర్వాత ఆర్థిక, ఇతర వ్యవహారాల్లో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. రాఘవులును హత్య చేసిన వారిలో కీలకంగా ఉన్న ఇద్దరు యువకులు సీఎస్‌పురం మండలం వాసులుగా తెలుస్తోంది. వారిలో ఒకరు పాత నేరగాడు. మరోకరు యువకుడు ఉన్నాడు. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందిన స్నేహితులుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు హత్యకు కారణాలపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు సాగిస్తున్నారు.

ఇంట్లోనే రాఘవులు హత్య
బ్యాంక్‌ ఉద్యోగి రాఘవులకు, యువకులకు ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఇంట్లో సిట్టింగ్‌లో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. హత్యకు ముందు ముగ్గురూ పూటుగా మద్యం తాగారు. ఆర్థిక పరమైన అంశాల్లో అప్పుడు వివాదం జరిగింది. ఆ క్రమంలో రాఘవులును కొట్టి, కత్తితో పొడిచి హత్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాఘవులను చంపిన ఇద్దరు యువకులు ఆ తర్వాత మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి చిల్లచెట్లల్లో పడేసి దిండు కవరు, దప్పుటి కప్పి పెట్రోలు పోసి తగల పెట్టినట్లు పోలీసులు నిర్ధారించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు