ప్రాణాలు తీసిన విద్యుత్‌ తీగలు

21 Jan, 2019 13:00 IST|Sakshi
మృతి చెందిన వెంకటేశ్వర్లు వంజివాక శ్రీనివాసులు (ఫైల్‌)

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు మృత్యువాత

కలిగిరిలో రైతు, కోటలో వైఎస్సార్‌సీపీ నేత మృతి

జిల్లాలో విద్యుత్‌ తీగలు ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్నాయి. వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్‌ మోటారు మరమ్మతులు చేస్తుండగా రైతు, విద్యుత్‌ మోటార్ల మెకానిక్‌గా పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీ నేత విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆయా ఘటనల్లో గ్రామాల్లో విషాదచాయలు అలముకున్నాయి.

నెల్లూరు, కలిగిరి: మండలంలోని ఎరుకులరెడ్డిపాళెంలో పొలంలో మోటార్‌కు మరమ్మతులు చేస్తుండటంగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌తో తాళ్లూరి వెంకటేశ్వర్లు (38) ఆదివారం మృతి చెందాడు. వెంకటేశ్వర్లు పోలంలో వేసిన బోరుకు ఏర్పాటు చేసిన మోటార్‌ మరమ్మతులకు గురైంది. మరో ఇద్దరి సహకారంతో మోటార్‌ను బోరులో నుంచి బయటకు తీస్తున్నారు. మోటార్‌కు ఉన్న ఇనుప పైపులు పైన వెళ్తున్న 11 కేవీ విద్యుత్‌ తీగలను తగిలాయి. దీంతో ఇనుప పైపులకు విద్యుత్‌ సరఫరా అయ్యి విద్యుత్‌ షాక్‌తో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు ప్రమాదం నుంచి బయట పడ్డారు. మృతుడు వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటేశ్వర్లు మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.    

విద్యుదాఘాతానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి
కోట: విద్యుదాఘానికి గురై వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్‌ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని అల్లంపాడులో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన వంజివాక శ్రీనివాసులు (28) ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్‌గా ఉన్నాడు. శ్రీనివాసులు సాయంత్రం ఇంటి పరిసరాల్లో మోటార్‌ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. ఘటన స్థలంలో కుప్పకూలిన అతన్ని కోటలోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించిగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్రీనివాసులుకు ఏడాది కిందటే వివాహమైంది. అప్పటి వరకు అందరితో కలిసిమెలిసి ఉన్న శ్రీనివాసులు మృతి చెందాడని తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులు రోదించడం అందరినీ కంటతడి పెట్టిం చింది. శ్రీనివాసులు వైఎస్సార్‌సీపీకి వీరాభిమాని కావడంతో అతన్ని పార్టీ నేతలు బూత్‌ కన్వీనర్‌గా నియమించాడు. వైఎస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లకూరు దశరథరామిరెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.  

మరిన్ని వార్తలు