స్వలింగ సంపర్కం : ఇద్దరు మహిళలకు శిక్ష

14 Aug, 2018 17:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దోషులుగా తేల్చిన మలేషియా కోర్టు

షరియా చట్టం ప్రకారం శిక్ష

కొరడా దెబ్బలు, భారీ జరిమానా విధింపు

కౌలలంపూర్‌ : స్వలింగ సంపర్కం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ముస్లిం మహిళలను మలేషియాలోని ఓ కోర్టు దోషులుగా తేల్చింది. ఒక్కొక్కరికి ఆరు కొరడా దెబ్బలు, 56 వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. న్యాయమూర్తి ఆదేశాలతో కోర్టు ఆవరణలోనే వారిని  కొరడాతో దండించారు. ఈ ఘటన తెరంగను రాష్ర్టంలో మంగళవారం చోటుచేసుకుంది. 32, 22 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు గత ఏప్రిల్‌లో స్వలింగ సంపర్కానికి ఒడిగట్టారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ముహమద్‌ ఖాస్మీజాన్‌ అబ్దుల్లా మీడియాకు వెల్లడించారు. షరియా చట్టాల ప్రకారం స్వలింగ సంపర్కం నేరమని తెలిపారు.

స్వలింగ సంపర్కానికి సంబంధించి తెరంగను రాష్ర్టంలో ఇదే తొలి తీర్పు అని తెలిపారు. కాగా, ఈ తీర్పుపై మలేషియాలోని ఎల్‌జీబీటీ కమ్యూనిటీ నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇలాంటివి గతంలో చోటుచేసుకున్నా ఎవర్నీ దోషులుగా తేల్చలేదని తిలగా సులాతిరే అనే హక్కుల కార్యకర్త కోర్టు తీర్పుపై మండిపడుతున్నారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం ఎల్‌జీబీటీ కమ్యూనిటీపై వివక్ష చూపుతున్నారడానికి నిదర్శనమని విమర్శించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు