టీనేజ్‌ యువతుల్ని కుటుంబ సభ్యులే కాల్చిచంపారు!

19 May, 2020 09:11 IST|Sakshi

ఇస్లామాబాద్ :  పాకిస్తాన్‌లో దారుణం చోటుచేస‌కుంది. ఓ యువ‌కుడితో స‌న్నిహితంగా మాట్లాడిన కార‌ణంగా ఇద్ద‌రు యువ‌తుల‌ను వారి కుటుంబ‌స‌భ్యులే అతి కిరాత‌కంగా కాల్చి చంపారు. వివ‌రాల్లోకి వెళితే..16,18 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న ఇద్ద‌రు టీనేజీ యువ‌తులు ఓ యువ‌కుడితో స‌న్నిహితంగా మెలిగిన వీడియా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. నిజానికి ఇది ఏడాది క్రితం తీసిన వీడియా. అయితే ఆ వీడియాలో బాలిక‌లు యువ‌కుడితో స‌న్నిహితంగా క‌నిపించ‌డంతో వారి కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. దీంతో ఇద్దిరినీ గ్రామ శివారులో కాల్చి చంపిన‌ట్లు పోలీసులు జ‌రిపిన విచార‌ణ‌లో తేలింది. తండ్రి, సోద‌రుడే ఈ ప‌ర‌వు హ‌త్య‌కు  పాల్ప‌డిన‌ట్లు ప్రాధ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని పోలీస్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు.

అయితే ఈ వీడియోలో మ‌రొక యువ‌తి  కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆమె ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా యువ‌కుడి ప్రాణాల‌కు కూడా హానీ ఉంద‌ని అందుకే ప్ర‌స్తుతం వారిద్ద‌రికీ భ‌ద్ర‌త క‌ల్పిస్తాం అని పోలీసు అధికారి తెలిపారు. ఇక పాకిస్తాన్‌లో మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై హింస తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంద‌ని నివేదిక‌లో వెల్ల‌డైంది. ప్ర‌తీ సంవ‌త్స‌రం ఆ దేశంలో 1000కి పైగా ప‌రువు హ‌త్య‌లు జ‌రుగుతాయ‌ని నివేదిక‌లో  తేలింది.


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా