గోవును చంపిన కేసులో ఇద్ద‌రు అరెస్ట్

11 Jun, 2020 09:29 IST|Sakshi

ల‌క్నో : త‌మ పొలంలో గ‌డ్డివేస్తుంద‌ని ఆవును కొట్టి చంపిన కేసులో ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల‌ను రాహుల్, ర‌విగా గుర్తించిన పోలీసులు వారిపై సెక్ష‌న్ 429 కింద కేసు న‌మోదు చేశారు. గోవ‌ధ‌కు పాల్ప‌డే వారిపై క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేస్తామ‌ని తాజాగా ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌మ పొలంలో ఉన్న ఓ దూడ‌పై దాడిచేసి దాన్ని ర‌క్షించ‌డానికి వెళ్తే మాపై కూడా దాడి చేసింద‌ని నిందితులు తెలిపారు. ఈ ప్ర‌య‌త్నంలోనే దానిపై క‌ర్ర‌ల‌తో కొట్టామ‌ని, ఆత్మ ర‌క్ష‌ణ‌లో భాగంగానే చేశాం త‌ప్పా చంప‌డం మా ఉద్దేశం కాద‌ని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఆవు అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయింది. (హత్య చేసి, నెత్తురు తాగిన కిరాతకుడు )

గోవ‌ధ నివార‌ణ చ‌ట్టం 2020 ప్ర‌కారం గోవును వ‌ధించిన వారికి ఏడాది నుంచి 10 సంవత్స‌రాల జైలు శిక్ష‌తో పాటు రూ. 1 ల‌క్ష నుంచి రూ. 3 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌రిమానా విధిస్తామ‌ని ఇటీవ‌ల ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రెండ‌వ‌సారి నేరాలనికి పాల్ప‌డితే శిక్ష‌ను రెట్టింపు చేస్తామ‌ని తెలిపింది. అంతేకాకుండా అన‌ధికారికంగా మాంసం విక్ర‌యాలు జ‌రిపిన నిందితుల‌కు కూడా ఇదే శిక్ష విధిస్తామ‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో గోవును జాతీయ జంతువుగా ప్ర‌క‌టించాల‌ని కొంద‌రు డిమాండ్ చేస్తున్నారు. (యూపీ ఆర్డినెన్స్‌ నేపథ్యంలో ఎంఐఎం వ్యాఖ్యలు )

మరిన్ని వార్తలు