లైంగిక దాడి కేసులో నిందితుల అరెస్టు 

14 Feb, 2020 03:30 IST|Sakshi

కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

జహీరాబాద్‌: మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఇద్దరి నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ గణపత్‌ జాదవ్‌ తెలిపారు. గురువారం కేసు వివరాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 11న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ సమీపంలో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితులైన ఒంగోలు జిల్లా కొమురోలు మండలం ఎడమాకుల గ్రామానికి చెందిన బండి పవన్‌కుమార్‌ (29), కాజీపేట పట్టణం దర్గా ఫాతిమానగర్‌కు చెందిన బ్రహ్మచారి (38)లను అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపర్చారు. పవన్‌కుమార్‌ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అలాగే ఉప్పల్‌లో సిర్థపడిన ఖాజిపేటకు చెందిన బ్రహ్మచారిపై పలు కేసులు ఉన్నాయి.

గతంలో ఓ కేసులో ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సోమాచారి (45) బుధవారం రాయికోడ్‌ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కేసులో ఏ–1 నిందితుడు పవన్‌కుమార్‌ను గంగ్వార్‌ క్రాస్‌ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోగా విషయాన్ని గమనించి తమ వెంట తెచ్చుకున్న కారులో బ్రహ్మచారి, సోమచారిలు రాయికోడ్‌ వైపు పరారయ్యారు. కారును వేగంగా నడపడంతో బోల్తా పడి సోమాచారి అక్కడికక్కడే మరణించగా బ్రహ్మచారి గాయపడ్డాడు. దీంతో బ్రహ్మచారికి ఆస్పత్రిలో చికిత్స అందించి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ సైదేశ్వర్, ఎస్‌ఐ వెంకటేశ్‌ పాల్గొన్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో మరణించిన సోమాచారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు