పుట్టినరోజు విషాదం..గుడికెళుతూ తాత,మనవడు మృతి

24 Dec, 2017 10:40 IST|Sakshi

పశ్చిమగోదావరి జిల్లాలో వ్యాన్‌ బీభత్సం...

15 మంది కూలీలకు తీవ్ర గాయాలు

సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం ఉదయం విషాదం నెలకొంది. పాదచారులపైకి వ్యాన్ దూసుకుపోవడంతో ఇద్దరు కూలీలు మృతిచెందారు. భీమడోలు మండలం కురెళ్లగూడెం గ్రామం దగ్గర  జాతీయరహదారిపై ఆదివారం ఉదయం ఓ వ్యాన్ వేగంగా వెళ్తూ రోడ్డుపక్కన పాదచారులపైకి దూసుకెళ్ళింది. దీంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి. స్కార్పియో వాహనం అతి వేగంగా ప్రయాణిస్తూ కురెళ్లగూడెం జాతీయ రహదారి వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ముందుగా ఢీకొట్టింది. ఆ తర్వాత అంతే వేగంతో ఓ మోటార్ సైకొల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల పాలూరి అరుణ్ (8) అక్కడికక్కడే మృతి చెందగా...మోటార్ సైకిల్ నడుపుతున్న బాలుని తాత దాసరి కృష్ణయ్య ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కురెళ్లగూడెం గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య మనవడు అరుణ్ పుట్టినరోజు సందర్భంగా గుడికి తీసుకెళ్తుండగా రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందడం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో కూలి పనులకు ఆటోలో వెళ్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరికి చేతులు తెగిపోగా..మరికొందరికి కాళ్లు తెగిపోయి. జాతీయ రహదారి రక్తమోడుతూ భీతావహంగా కనిపించింది. తీవ్ర గాయాల పాలైన 15 మంది కూలీలను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్దితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సంఘటనా ప్రాంతాన్ని ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, పోలీసు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు.

మరిన్ని వార్తలు