తుపాన్‌ మింగేసింది

4 Aug, 2019 10:57 IST|Sakshi
నాగజాబిలి మృతదేహం, ఘటనా స్థలంలో యుగంధర్‌ మృతదేహం

మోపెడ్‌ను ఢీకొన్న వాహనం

తండ్రీకుమార్తె దుర్మరణం

మరో కూతురి పరిస్థితి విషమం

సాక్షి, నెల్లూరు : చిన్నపాటి సంపాదనతో కుమార్తెలు ఇద్దరిని కష్టపడి చదివిస్తున్నాడు. వారు సైతం తండ్రి ఆశయాలకు అనుగుణంగా చదువుల్లో రాణిస్తున్నారు. సంతోషంగా సాగిపోతున్న కుటుంబంలో తుపాను విషాదఛాయలు నింపింది. రోజూలాగే బడి నుంచి కుమార్తెలను మోపెడ్‌పై ఇంటికి తీసుకెళుతుండగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో తండ్రి, చిన్నకుమార్తె దుర్మరణం పాలవగా, పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా మారింది. ఈ హృదయ విదారక ఘటన గొలగమూడి రోడ్డులోని వీపీఆర్‌ కన్వెన్షన్‌హాలు సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు...వెంకటాచలం మండలం గొలగమూడిలో యుగంధర్‌(52) కుటుంబం నివాసం ఉంటోంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అన్నమయ్యసర్కిల్‌ సమీపంలోని శ్రీకృష్ణవిద్యావిహార్‌లో  పెద్ద కుమార్తె వందన పదో తరగతి, చిన్నకుమార్తె నాగజాబిలి(12) ఏడోతరగతి చదువుతోంది. ప్రతి రోజు యుగంధర్‌ మోపెడ్‌పై పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లి తీసుకొస్తుండేవాడు. రోజూలాగే శనివారం సాయంత్రం గొలగమూడి నుంచి టీవీఎస్‌ మోపెడ్‌పై నెల్లూరుకు వచ్చాడు. నెల్లూరులో పనిచూసుకుని కూమార్తెలు చదువుతున్న పాఠశాల వద్దకు వెళ్లాడు. కుమార్తెలు ఇద్దరిని మోపెడ్‌పై ఎక్కించుకుని వారితో మాట్లాడుకుంటూ ఇంటికి బయలుదేరాడు.  


ప్రమాదానికి కారణమైన తుపాన్‌ వాహనం 

ఈ క్రమంలో వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌ సమీపంలోకి వచ్చేసరికి గొలగమూడి వైపు నుంచి వస్తున్న  తుపాన్‌ వాహనం వేగంగా వచ్చి ఢీకొని సమీపంలోని ఖాళీ ప్రదేశంలోకి దూసుకెళ్లింది. దీంతో మోపెడ్‌పైనున్న యుగంధర్, కుమార్తెలు ఎగిరి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో పడ్డారు. తీవ్రగాయాలపాలైన యుగంధర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయాలతో పడి ఉన్న వందన, నాగజాబిలిని చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నకుమార్తె మృతి చెందింది. పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు రూరల్‌ ఎస్సై నాగార్జునరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. యుగంధర్‌ మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం అపోలో హాస్పిట్‌కు చేరుకుని చిన్నకుమార్తె మృతదేహాన్ని సైతం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అనుమానం పెనుభూతమై.. 

టీడీపీ నేత బార్‌లో మద్యం విక్రయాలు

డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి

లక్ష విలువైన మద్యం బాటిల్స్‌తో పరార్‌

ప్రాణం తీసిన మద్యం మత్తు

సినిమా

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది

అనుకున్న సమయానికే వస్తారు

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు