తెల్లారిన బతుకులు

16 Jun, 2019 11:11 IST|Sakshi
రుద్రాక్షుల సత్యనారాయణ, తలచుట్ల లక్ష్మన్నాయుడు

సాక్షి, రామభద్రపురం(విజయనగరం) : కొద్ది రోజులుగా ఎండలు ఎక్కువగా ఉండడంతో తెల్లవారు జామునే పనులు చేసుకుందామనుకున్నారు. ఇందులో భాగంగానే తెల్లవారే పనులకు వెళ్లారు. అయితే విధి వక్రీకరించడంతో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఇంటి యజమానులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు లబోది బోమంటున్నారు. మండలంలోని బూశాయవలస వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  వివరాల్లోకి వెళితే.. రామభద్రపురం గ్రామానికి చెందిన రుద్రాక్షుల సత్యనారాయణ (దుర్గ), ఎస్‌. చింతలవలసకు చెందిన తలచుట్ల లక్ష్మున్నాయుడు ఇటుక ట్రాక్టర్‌లో రవాణా కార్మికులుగా పనిచేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో శనివారం వేకువజామున ఇటుకల రవాణాకు బయలుదేరారు. రామభద్రపురం మీదుగా మామిడివలస వెళ్తుండగా.. బూశాయవలస మలుపు వద్ద ట్రాక్టర్‌ నిలిపివేశారు. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొనడంతో ట్రాక్టర్‌ తిరగబడింది. ఈ ప్రమాదంలో  ట్రాలీ మీద పడడంతో లక్ష్మున్నాయుడు, ఇంజిన్‌ మీద పడడంతో సత్యనారాయణ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.  తెల్లవారుజాము సమయంలో ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి.  

రెండు గ్రామాల్లో విషాద ఛాయలు...
మండలంలోని ఎస్‌. చింతలవలస, రామభద్రపురం గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో శుక్రవారం జరిగిన ఓ ప్రమాదంలో ఎస్‌.చింతలవలసకు చెందిన ఇద్దరు కార్మికులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మరువక ముందే మళ్లీ అదే గ్రామానికి చెందిన లకు‡్ష్మనాయుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భర్త చనిపోవడంతో ఇక తనకు దిక్కెవరంటూ భార్య రాములమ్మ రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.రామభద్రపురం కర్ణివీధికి చెందిన రుద్రాక్షుల సత్యనారాయణ (దుర్గ) మృతి చెందడంతో కుటుంబం రోడ్డున పడింది. కూలి చేస్తే గాని ఇల్లు గడవని పరిస్థితి వారిది. ప్రమాదంలో సత్యనారాయణ మృతి చెందడంతో అతని భార్య సింహాచలం, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

రూ. 3.3 కోట్లు దోచేసి.. దర్జాగా..

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

తల ఛిద్రం; మోడల్‌ దారుణ హత్య

బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

గిద్దలూరు వాసి చిత్తూరులో ఆత్మహత్య

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన యువతి..

అంత్యక్రియల అనంతరం నిలదీస్తే.. ఒప్పుకొన్న భర్త

తల్లి జబ్బుపడిందని.. కుమార్తె ఆత్మహత్య

సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

తమ్ముడిపై కొడవలితో దాడి

పోలీసునంటూ షాపులో దౌర్జన్యం

యువకుడి మృతదేహం లభ్యం

లారీ డ్రైవర్‌పై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి

టోల్‌గేట్‌ బిల్లింగ్‌ బూత్‌ను ఢీకొన్న లారీ

క్యాషియర్‌పై దాడి చేసి దోపిడీ

అనంతపురంలో క్షుద్రపూజల కలకలం!

నిర్లక్ష్య‘భటులు’..!

కలిదిండిలో కక్షతో.. భర్త లేని సమయంలో దాడి!

ఇటీవలే శ్రీలంక పర్యటన.. క్షణికావేశంలో ఆత్మహత్య

ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో...!

వివాహేతర సంబంధంపై అనుమానంతో..

మాట్లాడుతుండగా పేలిన సెల్‌ఫోన్‌

తమిళనాడులో పేలుళ్లకు కుట్ర?

పోలీసులపై మందుబాబుల దాడి

మరిదిని చంపి.. వదినపై పోలీసుల గ్యాంగ్‌ రేప్‌!

దంతేవాడలో ఎదురుకాల్పులు.. ఇద్దరి మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!