విదేశాల పేరుతో ఎర వేశారు.. ఆపై

26 Sep, 2017 18:10 IST|Sakshi

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ240 మంది నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూళ్లునిందితులను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్‌: విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ  నిరుద్యోగులను మోసం చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. అలా మోసం చేసిన ఇద్దరిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కోటిన్నర రికవరీ చేశారు. 240 మంది నిరుద్యోగుల నుంచి రెండున్నర కోట్ల రూపాయలు అక్రమంగా వసూళ్లు చేసినట్లు తెలిపారు. వివరాలివి.. ఎర్రగడ్డలోని సన్‌ రైజ్‌ అండ్‌ ట్రావెల్స్‌ పేరుతో కన్సల్టెన్సీ కార్యాలయాన్ని నిందితులు శ్రీధర్రెడ్డి, బస్వ జగన్నాధం నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు.  

కెనడాలో జాబ్స్‌ ఉన్నాయంటూ కొంతమంది నిరుద్యోగుల నుంచి లక్ష 20 వేల రూపాయలు వసూళ్లు చేసి తాత్కాలిక వర్క్‌ పర్మిట్‌ వీసా ఇప్పించారు. నెలలు గడిచినా ఉద్యోగం ఇప్పించకపోయేసరికి మోసం జరిగిందని గ్రహించి నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితుల బాగోతం వెలుగులోకి వచ్చింది. తెలుగు, కన్నడ, తమిళ్‌ పత్రికలలో ప్రకటనలు ఇచ్చి నిరుద్యోగులను ఆకర్శించినట్లు విచారణలో వెల్లడైంది.

ఖరీదైన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ముందుగా నమ్మకం కోసం తక్కువ మొత్తంలో నగదు వసూళ్లు చేశారు. నకిలీ కంపెనీ పేరుతో ఆఫర్‌ లెటర్‌ ఇచ్చి వసూళ్లకు పాల్పడ్డారు. ఇదే విధంగా కెనడా, జార్జియా, మలేసియా తదితర దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎర వేశారు. కేసు నమోదు చేసిన పోలీసులను నిందితులను రిమాండ్‌కు తరలించారు.

>
మరిన్ని వార్తలు