ఉన్నావ్‌ కేసులో మరో ఇద్దరి అరెస్ట్‌

17 May, 2018 11:10 IST|Sakshi
ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు(పాత చిత్రం)

లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార ఘటన కేసులో ఇద్దరు పోలీసులను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌తోపాటు, ఇతర నిందితులను సీబీఐ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అత్యాచారానికి గురైన బాలిక తండ్రిని అక్రమంగా అరెస్ట్‌ చేయడంతోపాటు.. అతని మృతికి కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐలు అశోక్‌ సింగ్‌, ప్రసాద్‌ సింగ్‌లను సీబీఐ బుధవారం అరెస్ట్‌ చేసింది. ప్రస్తుతం వారిద్దరు సస్పెన్షన్‌ ఎదుర్కొంటున్నారు.

దీనిపై సీబీఐ అధికారులు మాట్లాడుతూ.. అరెస్ట్‌ అయిన ఇద్దరు ఎస్‌ఐలను గురువారం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి ప్రయత్నించడంతో పాటు, బాధితురాలి కుటుంబం పట్ల కుట్ర పూరితంగా వ్యవహరించారనే ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. కాగా ఈ కేసులో స్థానిక పోలీసుల నిర్లక్ష్యంపై అలహాబాద్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

చదవండి : కస్టడీలో ఎమ్మెల్యే బాధిత యువతి తండ్రి మృతి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు