23 రోజులుగా మృత్యువుతో పోరాడి.. చివరికి

30 Oct, 2019 12:30 IST|Sakshi

టీ.నగర్ ‌: తమిళనాడులో సెల్ఫీ మోజు సోమవారం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రానికి చెందిన హరి ఓం సింగ్‌ వేలూరులోని ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. ఈ నెల 6వ తేదీన హరి ఓం సింగ్‌ కాట్పాడి సమీపంలోగల సేవూరు రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్సు రైలు పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సెల్ఫీ దిగుతున్న సమయంలో ఒక్కసారిగా హై ఓల్టేజ్‌ విద్యుత్‌ తీగలు తగిలి హరిఓం సింగ్‌ షాకుకు గురై గాయపడ్డాడు. దీంతో హరి ఓం సింగ్‌ను వెంటనే వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మిలటరీ ఆసుపత్రిలో చేర్పించగా 23రోజులుగా మృత్యవుతో పోరాడిన హరి ఓం సింగ్‌ మంగళవారం మృతిచెందాడు. 

మరో ఘటనలో వేలూరు జిల్లా వాణియంబాడి కలంద్ర గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి మృతి చెందాడు. మురళి తన స్నేహితులైన మణికంఠన్‌, విజయ్‌కుమార్‌లతో కలిసి పోలూరు సమీపంలోని జమునామరత్తూరు కొండకు సోమవారం విహారయాత్రకు వెళ్లారు. ఆ సమయంలో మురళి, మణికంఠన్‌లు బండ పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇద్దరు సెల్ఫీ దిగుతుండగా జారి పడడంతో మురళికి బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నెల్లూరు జిల్లాలో విషాదం

టీవీ యాంకర్‌ అనుమానాస్పద మృతి

లాక్‌డౌన్‌ వేళ జమ్మూ కశ్మీర్‌లో దారుణం

పురుగుల మందుతో బోండాలు.. ఇద్దరి మృతి

డాక్టర్‌ సుధాకర్‌పై సస్పెన్షన్‌ వేటు

సినిమా

నా కొడుకు కోలుకున్నాడు: దర్శకుడు

చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

నా పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా: గోవిల్‌

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’

‘నా భార్యకు హెల్ప్‌ చేస్తున్న జానీ సార్‌’

మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌: మహేశ్‌ బాబు