బావిలో చిన్నారి మృతదేహం

25 Jun, 2019 07:25 IST|Sakshi

కోవై సమీపాన సంచలనం

చెన్నై,టీ.నగర్‌: కోయంబత్తూరు విలాంకురిచ్చిలో సోమవారం రెండున్నరేళ్ల బాలిక బావిలో శవమై తేలింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. కోయంబత్తూరు అన్నూరు కరియ గౌండనూర్‌కు చెందిన కనకరాజ్, కాంచన దంపతులు విలాంగురిచ్చిలో గల కుప్పురాజ్‌ గార్డెన్‌లో అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. కనకరాజ్‌ జేసీబీ వాహనం అద్దెకు ఇస్తుంటారు. వీరికి రెండున్నరేళ్ల కుమార్తె అమృత ఉంది. ఆదివారం వీరి ఇంటికి బంధువులు వచ్చి ఉన్నారు. రాత్రి అందరు భోజనం చేసిన తర్వాత బిడ్డతో పాటు కాంచన, కనకరాజ్‌ ఇంట్లో నిద్రించేందుకు వెళ్లారు. ఇంటికి వచ్చిన బంధువులు కొందరు ఆరుబయట మంచాలపై నిద్రించారు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బిడ్డ ఏడవడంతో పాలిచ్చి పడుకోబెట్టింది.

ఇలా ఉండగా సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కాంచన లేచి చూడగా బిడ్డ కనిపించక పోవడంతో దిగ్భ్రాంతి చెందింది. ఆ తర్వాత బిడ్డ కోసం బంధువులు, భర్త కనకరాజ్‌ తీవ్రంగా గాలించారు. అయితే బిడ్డ ఆచూకీ తెలియలేదు. ఇంటి నుంచి 500 మీటర్ల దూరంలో కరువేలంకాడు ప్రాంతంలో వెతికి చూడగా, అక్కడ ఉన్న పాడుబడిన బావిలో బిడ్డ కనిపించింది. వెంటనే బావిలోకి తాడు సాయంతో దిగి బిడ్డను వెలికి తీశారు. బిడ్డ స్పృహతప్పి ఉండవచ్చని భావించి వెంటనే సమీపాన గల ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే పరిక్షీంచిన వైద్యులు పాప మృతి చెందినట్లు తెలిపారు. దీని గురించి సమాచారం అందుకున్న పీలమేడు పోలీసులు సంఘటనా ప్రాంతానికి వెళ్లి విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం పీఏ అంటూ..డబ్బులు డిమాండ్‌

కాగ్నిజెంట్‌ ఉద్యోగి ఆత్మహత్య

బాలికను వేధించిన వాచ్‌మెన్‌కు దేహశుద్ధి

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

రూ. 3.3 కోట్లు దోచేసి.. దర్జాగా..

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

తల ఛిద్రం; మోడల్‌ దారుణ హత్య

బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

గిద్దలూరు వాసి చిత్తూరులో ఆత్మహత్య

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన యువతి..

అంత్యక్రియల అనంతరం నిలదీస్తే.. ఒప్పుకొన్న భర్త

తల్లి జబ్బుపడిందని.. కుమార్తె ఆత్మహత్య

సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

తమ్ముడిపై కొడవలితో దాడి

పోలీసునంటూ షాపులో దౌర్జన్యం

యువకుడి మృతదేహం లభ్యం

లారీ డ్రైవర్‌పై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి

టోల్‌గేట్‌ బిల్లింగ్‌ బూత్‌ను ఢీకొన్న లారీ

క్యాషియర్‌పై దాడి చేసి దోపిడీ

అనంతపురంలో క్షుద్రపూజల కలకలం!

నిర్లక్ష్య‘భటులు’..!

కలిదిండిలో కక్షతో.. భర్త లేని సమయంలో దాడి!

ఇటీవలే శ్రీలంక పర్యటన.. క్షణికావేశంలో ఆత్మహత్య

ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో...!

వివాహేతర సంబంధంపై అనుమానంతో..

మాట్లాడుతుండగా పేలిన సెల్‌ఫోన్‌

తమిళనాడులో పేలుళ్లకు కుట్ర?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!