మైనర్‌ రేప్‌ కేసులో ఏడుగంటల్లోనే తీర్పు 

22 Aug, 2018 03:50 IST|Sakshi

ఉజ్జయిని(మధ్యప్రదేశ్‌): మైనర్‌ బాలికను 14 ఏళ్ల పిల్లాడు రేప్‌ చేసిన కేసులో ఉజ్జయినిలోని జువైనల్‌ కోర్టు రికార్డుస్థాయిలో కేవలం ఏడుగంటల్లో తుది తీర్పు వెలువరించింది. నిందితుడిని దోషి గా తేల్చి అతనికి రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆగస్టు 15న రేప్‌ ఘటన చోటుచేసుకోగా కేసు నమోదు, దర్యాప్తు, నిందితుడి అరె స్టు, హాజరు, జువైనల్‌ కోర్టులో కేసు వాదోపవాదనలు ఇలా మొత్తం ప్రక్రియ అంతా కేవలం ఐదు రోజుల్లో పూర్తి అయ్యింది. కేసు డైరీని సోమవారం ఉదయం గం.10.45కు జువైనల్‌ జస్టిస్‌ బోర్డు న్యాయమూర్తి తృప్తి పాండే ముం దు పోలీసులు సమర్పించగా సాయంత్రం ఆరుకల్లా తుది తీర్పు చెప్పేశారని ప్రభుత్వ న్యాయ వాది దీపేంద్ర మలూ మంగళవారం మీడియాకు చెప్పారు. సివనీ జిల్లాలోని ఘటియా గ్రామంలో మైనర్‌బాలుడి ఇంట్లో ఆడుకుంటున్న బాలికను ఆ పిల్లాడు రేప్‌ చేసి పారిపోయి రాజస్తాన్‌లోని బంధువుల ఇంట్లో దాక్కున్నాడు. రేప్‌ విషయం తెల్సి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఉజ్జయిని ఎస్పీ సచిన్‌ అతుల్కర్‌ నేతృత్వంలోని బృందం ఆ పిల్లాడిని అరెస్టుచేశారు.   

మరిన్ని వార్తలు