కోర్టు ఆవరణలో నిందితుడి కాల్చివేత

13 Nov, 2017 13:10 IST|Sakshi

న్యూఢిల్లీ : ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై దేశ రాజధానిలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్‌ పరిధిలో సోమవారం దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడు వినోద్‌ తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. రోహిణి కోర్టు కాంప్లెక్స్‌ క్యాంటీన్‌కు చేరువలో ఈ ఘటన జరిగినట్లు వివరించారు. కాల్పులతో కోర్టు ఆవరణలోని వారందరూ షాక్‌కు గురైనట్లు తెలిపారు. గాయపడిన వినోద్‌ను ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. రోహిణి కోర్టు కాంప్లెక్స్‌ పరిసరాల్లో కాల్పులు జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి. గత ఏప్రిల్‌లో ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కొందరు కాల్చి చంపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు