రేపు పెళ్లి.. ఈ రోజు ఉరి

11 May, 2018 10:27 IST|Sakshi

ఉద్యోగం రాలేదని నిరుద్యోగి ఆత్మహత్య

సాక్షి, సూర్యాపేట : డిగ్రీ పట్టాసాధించాడు. సర్కారీ కొలువు కోసం శతవిధాల ప్రయత్నించాడు. అయినా ఫలితం లేదు. తప్పని పరిస్థితుల్లో ట్యూటర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. ఇంతలో పెళ్లి కూడా కుదిరింది.. కానీ ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో బలవ్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు.. అర్వపల్లి మండలం బొల్లం పల్లిలో కేసాగని సతీష్(25) డిగ్రీ పూర్తి చేశాడు. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించినా రాలేదు. ఈ విషయమై స్నేహితుల దగ్గర చాలా సార్లు వాపోయాడు. తప్పనిసరి పరిస్థితుల్లో బతుకుదెరువు కోసం నారాయణ జూనియర్‌ కాలేజీలో ట్యూటర్‌గా పనిచేస్తున్నాడు. ఇలీవలే సతీష్‌కు పెళ్లి కూడా కుదిరింది. శనివారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఉద్యోగం లేని కారణంగా తీవ్ర మనోవేదనతో ఉన్న సతీష్‌ శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రేపు పెళ్లి పీటలపై కూర్చున్న కొడుకు మీద అక్షింతలు చల్లాల్సింది పోయి.. చితికి నిప్పు పెట్టాల్సి వచ్చిందంటూ తల్లిదండ్రలు కన్నీరు మున్నీరు అ‍య్యారు. తాము ఏం పాపం చేశామంటూ అవిసేలా రోదిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా