పెనుగొండలో కాల్పుల కలకలం

20 Apr, 2018 07:24 IST|Sakshi
ధనలక్ష్మి తలలోకి దూసుకెళ్లిన సైకిల్‌ ఇనుపగుళ్లు, మేకులు

సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని పెనుగొండలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక వ్యాపారి మేడపాటి చిరంజీవి రెడ్డి, ధనలక్ష్మీ దంపతులపై దుండగులు తపంచాతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ధనలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి.ఆమె తలలోకి 28 సైకిల్‌ ఇనుపగుళ్లు, మేకులు దూసుకెళ్లాయి. వాటిని గుర్తించిన తణుకు వైద్యులు మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. మార్టేరులో వివాహానికి వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు... దంపతులపై కాల్పులు దిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మలుపులు తిరుగుతున్న కాల్పుల వ్యవహారం..
రియల్‌ ఎస్టేట్‌, వడ్డీ వ్యాపారం చేస్తున్న చిరంజీవి రెడ్డి నివాసంపై కస్టమ్స్‌ అధికారులు దాడులకు దిగారు. ఇంట్లో వ్యక్తులను బయటకు రానివ్వకుండా తలుపులు మూసేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు