బెట్టింగ్‌ సొమ్ముల కోసం గొడవ

2 Oct, 2019 10:25 IST|Sakshi

పశ్చిమగోదావరి ,తాడేపల్లిగూడెంరూరల్‌: క్రికెట్‌ బెట్టింగ్‌ సొమ్ముల కోసం విద్యార్థులు గొడవ పడిన సంఘటన మండలంలోని పెదతాడేపల్లిలోని ఒక ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగింది. మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సివిల్‌ ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన విద్యార్థులు, తేతలి సమీపంలోని వడ్లూరుకు చెందిన మరో విద్యార్థి మధ్య క్రికెట్‌ బెట్టింగ్‌ జరిగింది. వడ్లూరుకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి క్రికెట్‌ బెట్టింగ్‌ సొమ్ము విషయంలో వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్నాడు. అయితే తమకు ఇంకా సొమ్ములు రావాలంటూ ఆ విద్యార్థిపై సహచర విద్యార్థులు కొట్లాటకు దిగారు. ఆ విద్యార్థిని కొడుతున్న దృశ్యాలను మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోలు మంగళవారం వాట్సప్‌లో హల్‌ చల్‌ చేయడంతో విషయం బయటకు పొక్కింది.

మరిన్ని వార్తలు