విజయ్‌ మాల్యాకు బెయిల్‌ పొడిగింపు

13 Jan, 2018 02:25 IST|Sakshi

లండన్‌: దేశద్రోహం కేసులో విచారణ ఎదుర్కొంటున్న విజయ్‌ మాల్యాకు యూకే న్యాయస్థానం బెయిల్‌ను పొడిగించింది. ఏప్రిల్‌ 2 వరకు తాజా బెయిల్‌ పొడిగింపు వర్తిస్తుందని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు.

గురువారం సాయంత్రం ఈ కేసులో చివరి వాదనలు జరగాల్సి ఉన్నప్పటికీ డిఫెన్స్‌ లాయరు.. భారత ప్రభుత్వం కేసును కొట్టేయాలని డిమాండ్‌ చేయటంతో ఎటూ తేలకుండానే కేసు వాయిదా పడింది. భారత ప్రభుత్వం ఇచ్చిన సాక్ష్యాధారాలు అంగీకారయోగ్యంగా లేవంటూ మాల్యా తరపు న్యాయవాది వాదించారు. అయితే కేసు తర్వాతి విచారణ ఎప్పుడు జరుగుతుందనేది స్పష్టం కాకపోయినా మూడు వారాల తర్వాతే ఉంటుందని తెలుస్తోంది. ఏప్రిల్‌ 2017లో దేశద్రోహం కేసులో స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసులు మాల్యాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

మరిన్ని వార్తలు