గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యం

11 Nov, 2018 12:22 IST|Sakshi
అస్థిపంజరంను పరిశీలిస్తున్న సీఐ శ్రీనివాస్‌ 

తానూరు(ముథోల్‌): మండలంలోని మొగ్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యమైనట్లు ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం వివరాలు.. గ్రామానికి చెందిన పశువుల కాపరులు శనివారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఓ సంచిలో ఉన్న అస్థిపంజరం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంçఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దానిని పరిశీలించారు. మూడు నెలల క్రితం ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు సంచిలో మృతదేహన్ని తీసుకువచ్చి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ముథోల్‌ సీఐ శ్రీనివాస్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

మహారాష్ట్ర వాసిగా అనుమానం ... 
నాందేడ్‌ జిల్లా నాయేగావ్‌ తాలూకా కుంబర్‌గావ్‌ గ్రామానికి చెందిన సంతోష్‌తో తానూరు మండలం మొగ్లి గ్రామానికి చెందిన రుక్మాణి బాయితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. రుక్మిణిబాయి ఏడాది నుంచి మొగ్లి గ్రామంలోని తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. మూడు నెలల క్రితం సంతోష్‌ మొగ్లికి వచ్చి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సంతోష్‌ అచూకీ తెలియడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని అస్తిపంజరాన్ని పరిశీలించారు. సంతోష్‌ మృతదేహం కావచ్చని అనుమానిస్తున్నారు. అస్థిపంజరాన్ని ల్యాబ్‌కు తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించాలని బాధిత కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు