పోలీసును చెట్టుకు కట్టేసి చితకబాదారు

17 Jul, 2018 17:34 IST|Sakshi

సాక్షి, చండీగఢ్‌: పంజాబ్‌ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో దారుణం చోటుచేసుకుంది. శాంతిభద్రతలు కాపాడాల్సిన ఓ పోలీసు అధికారే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి స్థానికులు ఆగ్రహించి పోలీసును చెట్టుకు కట్టేసి చితకబాదారు.

వివరాలు.. పీకలదాక మద్యం సేవించిన ఓ పోలీసు అధికారి మద్యం మత్తులో తనపై అత్యాచారం చేయబోయాడని ఓ మహిళ స్థానికులకు తెలిపింది. దీంతో స్థానికులు ఆ అధికారిని పట్టుకొని చెట్టుకి కట్టేసి చితకబాదారు. ఈ విషయం తెలుసున్న పోలీసు ఉన్నతాధికారులకు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు