కొండచిలువను బంధించిన అంకంపాలెం గ్రామస్తులు

26 Apr, 2019 12:32 IST|Sakshi
అంకంపాలెంలో గ్రామస్తుల చేతిలో బంధీ అయిన కొండచిలువ

తూర్పుగోదావరి, ఆత్రేయపురం (కొత్తపేట): అంకంపాలెం గ్రామ శివారు పాటి చెరువు వద్ద గురువారం కొండచిలువ కనిపించడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. అయితే గ్రామస్తులు నేర్పుగా కొండచిలువను బంధించి అటవీ శాఖాధికారులకు అప్పగించారు.ప్రధానపంటకాలువ మూసివేయడంతో మత్స్య కారులు వేట సాగిస్తుంటే సుమారు 15 అడుగుల పొడవైన కొండచిలువ కాలువలో వారికి కనిపించింది. దీంతో మత్స్యకారులు కంగారు పడి పరుగులు తీశారు. గ్రామస్తులకు సమాచా రం అందడంతో పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

భయాందోళనతో వారు పొలంలో ఉన్న పశువులు, కోళ్లను గ్రామంలోకి తీసుకుపోయారు. ఈ విషయం మండలం అంతా వ్యాపించడంతో పంట కాలువ వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు.మత్స్యకారులు, ప్రజలు చేపలుపట్టే వలతో కొం డచిలువను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే కొండచిలువ మెల్లగా పంట కాలువ పైకి రావడంతో కోళ్లను పెట్టే బుట్టలో గ్రామస్తులు బంధించి అటవీ శాఖాధికారులకు తెలియజేశారు. అధికారులు గ్రామానికి చేరుకుని కొండచిలువను తీసుకువెళ్లారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు