ఐదుగురిపై కేసు!

5 Mar, 2020 08:20 IST|Sakshi

సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వెంకటాపూర్‌లో కులసంఘ స్థలం రిజిస్ట్రేషన్‌ వివాదంలో ఓ కుటుంబాన్ని కులపెద్దలు కులబహిష్కరణ చేశారు. గ్రామంలోని ముదిరాజ్‌ కులసంఘం స్థలాన్ని దుండిగాల శంకరయ్య పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ స్థలాన్ని ప్రస్తుత కులసంఘం అధ్యక్షుడు పాండావుల రవి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని ఒత్తిడి తెచ్చారు. వ్యక్తిపేరున కాకుండా సంఘం పేరిట రిజిస్ట్రేషన్‌ చేస్తానని శంకరయ్య తెలిపాడు. నిరాకరించిన కులపెద్దలు.. ఆర్నెల్లుగా గ్రామంలో పంచాయితీలు నిర్వహిస్తున్నారు. సమస్య కొలిక్కి రాలేదు. శంకరయ్యను కులబహిష్కరణ చేశారు. ఆయనతో మాట్లాడినందుకు గ్రామస్తుడు దుండిగాల రాజుకు రూ.30వేల జరిమానా విధించారు. రాజుకు జరిమానా విధించడం, తనను కులబహిష్కరణ చేయడంతో విసిగిపోయిన శంకరయ్య బుధవారం పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై వెంకటకృష్ణ విచారణ జరిపి బాధ్యుతలైన కులపెద్దలు పాండావుల రవి, కంకనాల కిషన్, కంకనాల పర్శయ్య, కంకనాల బాలయ్య, కంకనాల రమేశ్‌పై కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు