వీసా రద్దు... పాకిస్తాన్‌ వెళ్లాలని ఆదేశాలు

7 Oct, 2019 07:42 IST|Sakshi
అఫాక్‌లంకా, అర్సల అబిర్‌ (పాత చిత్రం)

సాక్షి బెంగళూరు: నాలుగేళ్ల క్రితం బెంగళూరు నగరంలోని చర్చివీధిలో జరిగిన బాంబు పేలుళ్లకు కేసులో నిందితుడిగా ఉన్న అఫాక్‌ లంకా (కారవార) భార్య అర్సల అబిర్‌ (పాకిస్తాన్‌) వీసా రద్దు చేసి స్వదేశానికి వెళ్లాలని ఆదేశించారు.  కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కారవారలో ఉంటున్న ఆమెను పాకిస్తాన్‌కు వెళ్లాలని ఆదివారం ఆదేశించారు. కారవారకు చెందిన అఫాక్‌ లంకా కొంత కాలం క్రితం దుబాయ్‌లో పాకిస్తాన్‌కు చెందిన అర్సల అబిర్‌ను వివాహం చేసుకున్నాడు. అనంతరం కొంత కాలం పాటు పాకిస్తాన్‌లో జీవనం సాగించారు.

అయితే 2006లో భార్య పిల్లలతో కలిసి కారవారకు వచ్చారు. ఈ క్రమంలో 2015లో బెంగళూరు చర్చివీధిలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో అఫాక్‌లంకా నిందితుడిగా గుర్తించిన ఎన్‌ఐఏ అధికారులు అప్పటి నుంచి విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలతో కలిసి ఉంటున్న అర్సల అబిర్‌ వీసా రద్దు చేసి స్వదేశానికి వెళ్లాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. చర్చి పేలుళ్లలో నిందితుడిగా ఉన్న అఫాక్‌ లంకాతో పాటు భార్య అర్సల అబిర్‌ బ్యాంకు ఖాతాలకు పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థల నుంచి నిధులు జమ అయినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలడంతో కేంద్ర హోం శాఖ వీసా రద్దు చేసి స్వదేశాలని వెళ్లాలని సూచించింది.  

మరిన్ని వార్తలు